Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దువ్వాడకు తర్వాత లగడపాటి శ్రీధర్ సినిమా.. సమ్మర్‌లో సెట్స్ పైకి..

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సమ్మర్‌కు కొత్త సినిమా ప్లాన్ చేసేశాడు. సమ్మర్‌లో బన్నీ బాగా బిజీ కానున్నాడని.. ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం ప్రాజెక్టు మీద తెగ వర్క్ చేస్తున్న అల్లు అర్జున్.. తాజాగా ప్రమ

Advertiesment
దువ్వాడకు తర్వాత లగడపాటి శ్రీధర్ సినిమా.. సమ్మర్‌లో సెట్స్ పైకి..
, ఆదివారం, 15 జనవరి 2017 (17:36 IST)
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సమ్మర్‌కు కొత్త సినిమా ప్లాన్ చేసేశాడు. సమ్మర్‌లో బన్నీ బాగా బిజీ కానున్నాడని.. ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం ప్రాజెక్టు మీద తెగ వర్క్ చేస్తున్న అల్లు అర్జున్.. తాజాగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్‌లో చెయ్యడానికి బన్నీ ఒప్పేసుకున్నాడు.

దీనికి ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్. ఇంతవరకు చిన్న సినిమాలకు మాత్రమే పరిమితమైన లగడపాటికి, కేవలం కథలు రాసుకోవడంతోనే కెరీర్ కొనసాగించిన వక్కంతంకు బన్నీ సినిమాతో ప్రమోషన్ వచ్చినట్లే లెక్క. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏప్రిల్ నెలలోనే షూట్స్‌కి వెళ్లాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.
 
ఇటీవల తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామితో బన్నీ ఓ సినిమా చేస్తున్నారని, జూన్ నెలాఖర్లో ఆ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని ప్రచారం జరిగినా, ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏవీ బయటకు రాలేదు.

మరోవైపు.. ‘గబ్బర్ సింగ్’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలతో మంచి కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్‌, అల్లు అర్జున్ కోసం మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేశారట.

దిల్‌రాజు నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుందని, వచ్చే ఏడాది వేసవికి సినిమాను విడుదల చేసేలా ప్రొడక్షన్ ప్లాన్ చేశారు. కానీ వక్కంతం సినిమానే బన్నీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హర్ధవర్ధన్ దర్శకత్వంలో శ్రీముఖి హీరోయిన్.. సోలోగా బంపర్ ఆఫర్ కొట్టేసింది..