Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రముఖ నిర్మాత కేఎస్.రామారావు అరెస్టు.. విడుదల

ప్రముఖ నిర్మాత కేఎస్. రామారావును జూబ్లీహిల్స్ పోలీసుల అరెస్టు చేసి, ఆ తర్వాత విడుదల చేశారు. గత నెల 2వ తేదీన జూబ్లీహిల్స్‌లోని దైవసన్నిధానం ఆనుకుని ఉన్న కల్చరల్‌ క్లబ్‌లో పార్కింగ్‌కు అక్రమంగా ఒక ఫ్లోర

Advertiesment
ప్రముఖ నిర్మాత కేఎస్.రామారావు అరెస్టు.. విడుదల
, గురువారం, 8 సెప్టెంబరు 2016 (17:36 IST)
ప్రముఖ నిర్మాత కేఎస్. రామారావును జూబ్లీహిల్స్ పోలీసుల అరెస్టు చేసి, ఆ తర్వాత విడుదల చేశారు. గత నెల 2వ తేదీన జూబ్లీహిల్స్‌లోని దైవసన్నిధానం ఆనుకుని ఉన్న కల్చరల్‌ క్లబ్‌లో పార్కింగ్‌కు అక్రమంగా ఒక ఫ్లోర్‌ వేయడంతో అది కూలిపోయి ఇద్దరు కూలీలు దుర్మరణం పాలైన విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత వారికి నష్టపరిహారం కింద ఎఫ్‌ఎన్‌సిసి కొంత మొత్తాన్ని ఇవ్వగా ప్రభుత్వపరంగా వారికి రావాల్సినవి ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఆ క్లబ్‌ను మూసివేశారు. 
 
ఈ ఘటనలో క్లబ్‌ ప్రెసిడెంట్‌గా కె.ఎస్‌.రామారావును, కార్యదర్శిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి వెంటనే బెయిల్‌పై విడుదలచేశారు. గతంలోనే ఈ క్లబ్‌ కట్టడాలపై కొందరు చిన్న నిర్మాతలు కలెక్టర్‌కు  ఫిర్యాదులు ఇచ్చిన దాఖలాలు వున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గణేష నిమజ్జన వేడుకలో మహేష్ తనయుడు.. దుర్గం చెరువులో నిమజ్జనం..!