Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్‌కు నిర్మాత ఆర్థిక సాయం!

Advertiesment
cash

ఠాగూర్

, గురువారం, 5 సెప్టెంబరు 2024 (12:46 IST)
తెలుగు సహాయ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు చెడిపోయి, నడవలేని దయనీయ స్థితిలో ఉన్నారు. యేడాదిగా ఆయనకు సినిమాలు కూడా లేవు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఉదారంగా స్పందించారు. ఫిష్ వెంకట్ కు రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు.
 
చదలవాడ శ్రీనివాసరావు తరపున ఆర్థిక సాయం తాలూకు చెక్కును టీఎఫ్‌పీసీ సెక్రటరీ టి.ప్రసన్నకుమార్, టీఎఫ్ పీసీ ట్రెజరర్, నిర్మాత రామసత్యనారాయణ, దర్శకుడు కె.అజయ్ కుమార్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్... ఫిష్ వెంకట్‌కు అందించారు.
 
ఈ సందర్భంగా టీఎఫ్ పీసీ కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ... "నిజానికి ఫిష్ వెంకట్ సహాయం అడగకుండానే ఆయన పడుతున్న ఇబ్బంది తెలుసుకొని చదలవాడ శ్రీనివాసరావు మా ద్వారా లక్ష రూపాయల చెక్కును అందించమని కోరారు. గతంలో కూడా చదలవాడ శ్రీనివాసరావు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. కోవిడ్ టైంలో ఇండస్ట్రీలో ఎంతోమంది వర్కర్స్‌కి అండగా నిలిచారు. చిత్రపురి కాలనీ ద్వారా ఎంతో మంది వర్కర్స్ అక్కడ నివసించడానికి ఆయన వంతు సహాయం అందించి ఎంతో మంది జీవితాలని నిలబెట్టారు' అని వివరించారు.
 
నటుడు ఫిష్ వెంకట్ మాట్లాడుతూ... "నా కష్టాన్ని తెలుసుకుని అడగకుండానే లక్ష రూపాయలు సహాయం అందించిన చదలవాడ శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చేసిన ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను నా కుటుంబం ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఇలాగే ఆయన ఇంకా ఎంతో మందికి సేవ చేసే విధంగా ఆ దేవుడు ఆశీస్సులు ఆయనపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తతో కాకుండా ఒంటరిగా తిరుమలకు వచ్చిన హన్సిక.. కారణం ఏంటి?