Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కదిలే రైలు ఎక్కిన జూనియర్ ఆర్టిస్టు మృతి: రైల్వే నిర్లక్ష్యమే కారణమంటూ..?

Advertiesment
కదిలే రైలు ఎక్కిన జూనియర్ ఆర్టిస్టు మృతి: రైల్వే నిర్లక్ష్యమే కారణమంటూ..?
, బుధవారం, 19 జనవరి 2022 (08:55 IST)
జూనియర్ ఆర్టిస్టు ప్రాణాలు కోల్పోయింది. చిన్న పొరపాటు జూనియర్ ఆర్టిస్టు ప్రాణం తీసింది. ఈ ఘటన షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కడపకు చెందిన జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే జూనియర్ ఆర్టిస్టుగానూ పనిచేస్తోంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లిన జ్యోతి సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్ పయనమైంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రైలు షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆగింది.
 
రైలు ఆగడంతో కాచిగూడ వచ్చేశామని భావించిన జ్యోతి రైలు దిగేసింది. అయితే, ఆ తర్వాత అది షాద్‌నగర్ అని తెలుసుకుని కంగారుపడింది. అప్పటికే రైలు కదలడంతో రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి అదుపుతప్పి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే రైల్వే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందింది. విషయం తెలిసిన జూనియర్ ఆర్టిస్టులు జ్యోతి మృతికి రైల్వే నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
 
జ్యోతిరెడ్డి మృతితో ఆమె కుటుంబ సభ్యులు, జూనియర్ ఆర్టిస్టులు ఆ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఛాదర్‌ఘాట్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులు, జూనియర్ ఆర్టిస్టులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం మృతదేహాన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. జ్యోతిరెడ్డి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటీటీలో తెలుగు చిత్రాలు - ఒకే రోజున 'అఖండ' - 'శ్యామ్ సింగరాయ్'