Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ నుంచి సున్ చలియా సాంగ్ రిలీజ్

Advertiesment
Priyadarshi  Nabha

డీవీ

, శుక్రవారం, 12 జులై 2024 (18:28 IST)
Priyadarshi Nabha
రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ జానర్‌లలోకి వచ్చే సినిమాలు ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ ను బూస్ట్ చేయడానికి చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు అవసరం. ఈ జానర్ చిత్రాలు ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది.' డార్లింగ్' సినిమా విడుదలకు ముందే మ్యూజికల్ హిట్‌గా మారింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ రోజు, మేకర్స్ థర్డ్ సింగిల్ సున్ చలియాను రిలీజ్ చేశారు.
 
మొదటి రెండు పాటలు ప్రియదర్శి, నభా నటేష్‌ల సోలో నంబర్‌లు కాగా, మూడవ పాట ఇద్దరూ కలసి అలరించిన డ్యూయెట్. వివేక్ సాగర్ ఈ పాటని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లవ్ సాంగ్ అఫ్ ది ఇయర్ గా చాలా బ్యూటీఫుల్ గా కంపోజ్ చేశారు. అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో ఈ పాట మెస్మరైజ్ చేస్తోంది. వివేక్ మ్యూజిక్ సాంగ్ మూడ్‌కి పర్ఫెక్ట్. కాసర్ల శ్యామ్ లిరిక్స్ లవ్లీగా వుండగా, అనురాగ్ కులకర్ణి వోకల్స్ ఎక్స్ప్రెసివ్ గా వున్నాయి. 
 
ఈ పాట లీడ్ పెయిర్ ప్రియదర్శి, నభా నటేష్ ల లవ్లీ జర్నీని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. ఈ పాటలో వీరిద్దరూ స్పార్క్లింగ్ కెమిస్ట్రీని షేర్ చేసుకున్నారు. ఈ పాట ఇన్స్టంట్ ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తోంది, థియేట్రికల్ రిలీజ్ కి ముందే ఇది చాలా పాపులర్ అవుతుంది.
 
ఈ చిత్రానికి హేమంత్ డైలాగ్స్ రాస్తుండగా, లవ్ టుడే ఫేం ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిట్ చేస్తున్నారు. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్.
 
'డార్లింగ్' మూవీ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
 
నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్, బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్, అనన్య నాగళ్ల తదితరులు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవకాశాల కోసం ఎగబడితే అడ్వాంటేజ్ తీసుకుంటారు.. నటి ఎస్తర్