అసలే పూరీ సినిమా.. ఆపై విజయ్ దేవర కొండ.. ప్రియా ప్రకాష్ వారియర్ ఖుషీ (video)

సోమవారం, 21 అక్టోబరు 2019 (13:47 IST)
విజయ్ దేవరకొండతో ఓవర్‌నైట్‌తో కన్నుగీటి స్టార్ అయిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ జతకట్టనుంది. డియర్ కామ్రేడ్ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమా మొదలుపెట్టాడు.

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్షన్‌లో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. బాక్సింగ్ నేపథ్యంతో సాగే ఈ సినిమాకు టైటిల్‌గా ఫైటర్ అని పెట్టబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నుగీటి కుర్రాళ్ల హృదయాలను గెలిచిన ప్రియా ప్రకాశ్ నటిస్తుందని తెలుస్తుంది.
 
అసలే పూరి సినిమా ఆపైన విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోతో ఛాన్స్‌ రావడంతో ప్రియా ప్రకాశ్ ఎగిరి గంతేస్తోంది. తప్పకుండా ఈ మూవీ హిట్ అయితే మాత్రం ప్రియా ప్రకాశ్ రేంజ్ మారిపోయే అవకాశం ఉందని సినీ జనం చెప్పుకుంటున్నారు. విజయ్ సినిమాతో పాటుగా నితిన్, చంద్రశేఖర్ యేలేటి మూవీ ఛాన్స్ కూడా అందుకుంది ప్రియా ప్రకాశ్. మరి ఈ సినిమాల ద్వారా హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటో లేదో వేచి చూడాలి. 
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆగిపోయిందనుకున్న రౌడీ బాయ్ మూవీ మళ్లీ సెట్స్‌పైకి...