సరిలేరు నీకెవ్వరులో తమన్నా ఐటమ్ సాంగ్.. ఇరగదీస్తుందిగా..?

మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (12:05 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలో తెల్లపిల్ల, మిల్కీబ్యూటీ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనుందట. తమన్నా ఇప్పటికే అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవకుశ, కేజీఎఫ్ చాప్టర్ 1 వంటి చిత్రాల్లో ప్రత్యేక గీతాలతో అలరించింది. ఇప్పుడు మహేష్ బాబు తాజా సినిమా ''సరిలేరు నీకెవ్వరు''లోను తమన్నా స్పెషల్ డ్యాన్స్ చేస్తుందని ఫిలిమ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ ఆ పాటకు సంబంధించిన ప్రత్యేక ట్యూన్స్ రెడీ చేస్తుండగా, త్వరలోనే ఆ పాటని షూట్ చేయనున్నారట. మొత్తానికి హీరోయిన్‌గా, ఐటమ్ భామగా తమన్నా అదరగొడుతుంది. ఇదే తరహాలో ''సరిలేరు నీకెవ్వరు''లోను అదరగొడుతుందని సినీ జనం అనుకుంటున్నారు. 
 
ఇకపోతే.. తమన్నా నటించిన ''దటీజ్ మహాలక్ష్మీ'' రీమేక్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. కాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. బండ్ల గణేష్‌, విజయశాంతితో పాటు పలువురు సినీ నటులు చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక మంథాన కథానాయికగా నటిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మీటూ వ్యవహారంలో మణిరత్నం.. కారణం ఎవరో తెలుసా?