డిజి పోస్ట్ సమర్పణలో ఎస్.ఎస్.సినిమాస్ బ్యానర్ పై మానస్.ఎన్, సనంశెట్టి జంటగా కళాసందీప్ దర్శకత్వంలో లక్ష్మీనారాయణరెడ్డి, కె.ఇసనాకరెడ్డి నిర్మించిన చిత్రం ప్రేమికుడు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా... దర్శకుడు కళాసందీప్ మాట్లాడుతూ.. ‘’కథ వినగానే నిర్మాతలు వెంటనే సినిమా చేద్దామని అన్నారు. గ్రాండియర్‌గా సినిమా రావడానికి వారే కారణం. నాకు అండగా నిలబడి ఎంకరేజ్ చేశారు. విజయ్ బాలాజీ ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మానస్ టాలెంటెడ్ హీరో. సినిమాటోగ్రాఫర్ శివ బ్యూటీఫుల్ సినిమాటోగ్రఫీ అందించారు. గ్రాండ్ విజువల్స్‌ను అందించారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. సినిమా బావుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించడం మరింత నమ్మకాన్ని పెంచింది. సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ వేలో సాగుతుంది. సినిమాను మే రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.
మానస్, సనంశెట్టి, అజీజ్, షకలక శంకర్, పరుచూరి వెంకటేశ్వరరావు, భాను చందర్, అనితా చౌదరి, సనా, శశాంక్ బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: కేరింత మధు, కెమెరా: శివ.కె, సంగీతం: విజయ్ బాలాజీ, నిర్మాతలు: లక్ష్మీ నారాయణరెడ్డి, కె.ఇసనాక సునీల్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కళా సందీప్ బి.ఎ.