ప్రేమ‌క‌థా చిత్రం 2 రిలీజ్ డేట్ ఫిక్స్..!

శనివారం, 23 మార్చి 2019 (19:59 IST)
ఆర్.పి.ఏ క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి సార‌థ్యంలో తెర‌కెక్కుతున్న హార‌ర్ కామెడీ సినిమా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2. గ‌తంలో ఇదే బ్యాన‌ర్లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి, హార‌ర్ కామెడీ సినిమాల‌కు తెలుగునాట ట్రెండ్ క్రియేట్ చేసిన ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌కు సీక్వెల్‌గా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 రెడీ అయింది. 
 
ఈ చిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమౌతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇద్నాని జంట‌గా న‌టిస్తున్నారు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌ డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.
 
సూప‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మొద‌టి పార్ట్‌కి ధీటుగా వ‌స్తున్న ఈ చిత్రానికి నందిత శ్వేతా న‌ట‌న మరో ప్ల‌స్ అవుతుంది. “ప్రేమ కథా చిత్రం 2” చిత్రానికి మరో ఆకర్షణ రావు రమేష్. ఆయన నటనకే కాదు వాయిస్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం రావు రమేష్ వాయిస్ ఓవర్ తో నడుస్తుంది. తాజాగా విడులైన ఈ సినిమా ట్రైల‌ర్ కు సోష‌ల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ల‌భించింది. దాదాపు 6 ల‌క్ష‌ల వ్యూస్ ఈ ట్రైల‌ర్ కు ద‌క్కాయి. ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 6న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వాడికి నేను ఎక్కడ టెంప్ట్ అయిపోతానోననీ... చాట్ బండి టీవీలో రెచ్చిపోతున్న స్వాతి నాయుడు