Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్త‌ుందా..? లేదా..?

Advertiesment
ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్త‌ుందా..? లేదా..?
, శనివారం, 9 మార్చి 2019 (18:56 IST)
సుధీర్ బాబు, నందిత రాజ్ జంటగా నటించిన చిత్రం ప్రేమకథా చిత్రమ్. ప్ర‌భాక‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా ప్రేమకథా చిత్రమ్ 2 రూపొందుతోంది. ఇందులో సుమంత్ అశ్విన్, నందిత శ్వేత, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హ‌రికిష‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సుద‌ర్శ‌న్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
 
ఈ నెల 21న‌ ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రల కాంబినేషన్లో.. హారర్ కామెడీ సీన్స్ పైన కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ .. అదేంటో తెలుసుకోవాలి.. అనే హీరో డైలాగ్ .. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదా… అనే నందిత శ్వేత డైలాగ్ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
 
ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే..గాయం 2, అవును 2, శంక‌ర్ దాదా జిందాబాద్, స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్, రాజు గారి గ‌ది 2… ఇలా తెలుగులో రూపొందిన సీక్వెల్ మూవీస్ స‌క్స‌స్ అవ్వ‌లేదు. మ‌రి.. ప్రేమకథా చిత్రమ్ 2 సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తుందా..? లేదా...? అనేది చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకీ మామ కోసం వచ్చేశానండీ.. పాయల్ రాజ్ పుత్