Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త లవ్ స్టోరీని ప్రేమకథలో చూపిస్తున్నాం : చిత్ర నిర్మాత

Advertiesment
Prem Katha team

డీవీ

, గురువారం, 4 జనవరి 2024 (17:25 IST)
Prem Katha team
కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "ప్రేమకథ". ఈ చిత్రాన్ని టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఉపేందర్ గౌడ్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివశక్తి రెడ్ డీ దర్శకత్వం వహించారు. రేపు "ప్రేమకథ" సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
నటుడు రాజ్ తిరందాసు మాట్లాడుతూ - "ప్రేమకథ" సినిమాలో నేను శంకర్ అనే క్యారెక్టర్ లో నటించాను. హీరోకు ఫ్రెండ్ గా కనిపిస్తా. ప్రతి సందర్భంలో అతని వెంటే ఉంటాను. మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ శివ గారికి థ్యాంక్స్. "ప్రేమకథ" థియేటర్స్ లో చూడండి. అన్నారు.
 
దర్శకుడు శివశక్తి రెడ్ డీ మాట్లాడుతూ -  "ప్రేమకథ" రియాల్టీకి దగ్గరగా ఉండే సినిమా. మీరంతా ఈ కథకు కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నా. టీమ్ సపోర్ట్ తో మంచి సినిమా చేయగలిగాను. రేపు థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు
 
నిర్మాత విజయ్ మాట్లాడుతూ - సినిమా తీయడం కన్నా దాన్ని కరెక్ట్ గా రిలీజ్ చేయడం పెద్ద టాస్క్ గా మారింది. "ప్రేమకథ" రిలీజ్ లో మధుర శ్రీధర్, బేబి ప్రొడ్యూసర్ ధీరజ్, శింగనమల కల్యాణ్ వీళ్లంతా హెల్ప్ చేశారు. వీళ్ల హెల్ప్ లేకుంటే సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతా కష్టపడి మంచి సినిమా చేశారు. "ప్రేమకథ"కు సక్సెస్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు
 
నిర్మాత సుశీల్ మాట్లాడుతూ - నాకు తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త. మలయాళంలో మూవీస్ చేశాను. "ప్రేమకథ" ఒక మంచి కాన్సెప్ట్  ఓరియెంటెడ్ మూవీ. ఒక కొత్త లవ్ స్టోరీని ఈ సినిమాలో చూపిస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం. అన్నారు
 
హీరో కిషోర్ కేఎస్డీ మాట్లాడుతూ - "ప్రేమకథ" సినిమా షూటింగ్ టైమ్ ను ఎంజాయ్ చేశాం. కొన్నిసార్లు టఫ్ టైమ్స్ చూశాం..అలాంటి టైమ్ లోనూ టీమ్ వర్క్ చేశాం. మా అందరినీ కంఫర్ట్ గా చూసుకున్నారు. మా కెమెరామెన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. మా సినిమాలో ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారు. వారి పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. అన్నారు.
 
నటుడు నేత్ర సాధు మాట్లాడుతూ - సినిమా గురించి మేము ఎంత చెప్పినా బాగుంటేనే మీరు చూస్తారు. అలా మీకు నచ్చేలా సినిమా ఉంటుందని నమ్మకంగా చెప్పగలను. "ప్రేమకథ" ఆడియెన్స్ కు ఒక కొత్త ఎక్సీపిరియన్స్ ఇచ్చే సినిమా అవుతుంది. అన్నారు.
 
హీరోయిన్ దియా సితెపల్లి మాట్లాడుతూ - "ప్రేమకథ" సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాను తెలుగు, తమిళం రెండు భాషల్లో చేశాం. మాకు తమిళ్ రాదు. హీరో కిషోర్ కు తమిళ్ తెలుసు. ఆయన నెక్ట్ డే డైలాగ్స్ మాకు చెప్పేవారు. అలా షూట్ చేశాం.  "ప్రేమకథ" ఔట్ పుట్ బాగా వచ్చింది. థియేటర్స్ లో మీరంతా ఎంజాయ్ చేస్తారు . అని చెప్పింది.
 
బిగ్ బాస్ ఫేం అమర్ దీప్ మాట్లాడుతూ - ప్రేమ కథలు ఎన్ని రాసినా, ఎన్ని సినిమాలు చేసినా అంతం ఉండదు. మాకు నటించేందుకు కూడా లవ్ స్టోరీస్ కు ఎండ్ ఉండదు. ఈ ప్రేమ కథ కూడా మెమొరబుల్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
బిగ్ బాస్ ఫేం శుభశ్రీ మాట్లాడుతూ - మనందరి లైఫ్  లో ప్రేమ కథలు ఉంటాయి. అయితే అవి కొన్ని సక్సె అవుతాయి  మరికొన్ని ఫెయిల్ అవుతాయి. కానీ ఆ జర్నీ మాత్రం మనం మర్చిపోలేం. ఈ ప్రేమ కథ మాత్రం థియేటర్స్ లో సక్సెస్ కావాలి. అని చెప్పింది.
 
బిగ్ బాస్ ఫేం శోభ శెట్టి మాట్లాడుతూ - నాకు యాక్షన్, డ్రామా సినిమాల కంటే లవ్ స్టోరీస్ ఇష్టం. ప్రేమ కథా సినిమాలని ఎక్కువగా చూస్తుంటాను. మీరు  కూడా థియేటర్స్ లో "ప్రేమకథ"  లాంటి కంటెంట్ ఉన్న మంచి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. అని చెప్పింది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగార్జున నా సామిరంగలో మంగ గా మిర్నా మీనన్