Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21 యేళ్ల మోడల్‌కు లైంగిక వేధింపులు.. మరో వివాదంలో ప్రత్యూష మాజీ బాయ్‌ఫ్రెండ్

ముంబైలో 21 యేళ్ల మోడల్‌ను లైంగికంగా వేధించినందుకుగాను బాలీవుడ్ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆమె మాజీ బాయ్ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మోడల్‌ను

Advertiesment
Pratyusha Banerjee's
, గురువారం, 15 సెప్టెంబరు 2016 (08:43 IST)
ముంబైలో 21 యేళ్ల మోడల్‌ను లైంగికంగా వేధించినందుకుగాను బాలీవుడ్ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆమె మాజీ బాయ్ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మోడల్‌ను లైంగికంగా వేధించినట్టు రాహుల్పై అంబోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 
 
మంగళవారం అర్థరాత్రి అంధేరిలోని ఓ పబ్ బయట ఉన్న మోడల్, ఈమె బాయ్‌ఫ్రెండ్ పట్ల రాహుల్ అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. రాహుల్ తన గాళ్ఫ్రెండ్తో కలసి పార్టీకి వెళ్లగా, మోడల్ తన ఫ్రెండ్ అయిన నిర్మాతతో కలిసి వచ్చింది. వీరిద్దరి ఎప్పటి నుంచే శత్రుత్వం ఉండటంతో గొవడవకు దిగారు. ఈ గొడవ పోలీసు స్టేషన్ వరకు చేరింది. 
 
మరోవైపు తనపై ఫిర్యాదు చేసినవారిపై రాహుల్ కూడా ఫిర్యాదు చేశాడు. రాహుల్, అతని గాళ్‌ఫ్రెండ్.. మోడల్, ఆమె బాయ్ఫ్రెండ్ దూషించుకోవడంతో పాటు కొట్టుకున్నారు. ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రాహులే కారణమని ప్రత్యూష తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం రాహుల్ బెయిల్పై విడుదలయ్యాడు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భాష తెలియని వానరాలుగా ప్రవర్తిస్తున్నాం.. కావేరీ మంటలపై కమల్ హాసన్ ట్వీట్