Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రియల్‌లైఫ్‌లో చేయలేనిది సినిమాలో చేస్తున్న : పూనమ్ కౌర్

రియల్‌లైఫ్‌లో చేయలేని పనులు చేయాలంటే.. నటిగా రీల్‌లైఫ్‌లో చేయడం ఒక లక్క్‌. అది తనకు వచ్చిందని నటి పూనమ్‌కౌర్‌ సంతోషాన్ని వ్యక్తం చేసింది. హీరోయిన్‌గా నటించి.. ఆ తర్వాత సపోర్ట్‌ పాత్రలు చేసిన ఆమె కొద్ద

Advertiesment
Pranayam movie launch
, ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (16:33 IST)
రియల్‌లైఫ్‌లో చేయలేని పనులు చేయాలంటే.. నటిగా రీల్‌లైఫ్‌లో చేయడం ఒక లక్క్‌. అది తనకు వచ్చిందని నటి పూనమ్‌కౌర్‌ సంతోషాన్ని వ్యక్తం చేసింది. హీరోయిన్‌గా నటించి.. ఆ తర్వాత సపోర్ట్‌ పాత్రలు చేసిన ఆమె కొద్దికాలం నటిగా దూరమైంది. అనుకున్న పాత్రలు రావడంలేదని చెబుతున్న ఆమెను ఓ పాత్ర టచ్‌ చేసిందట. అందుకే తాను 'ప్రణయం' సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు పేర్కొంది. 
 
నిజజీవితంలో లాయర్‌ కావాలనుకున్నాను. ఈ సినిమాలో లాయర్‌ పాత్ర పోషించడం చాలా థ్రిల్‌గా ఉంది. దర్శకుడు సత్యప్రసాద్‌ నా క్యారెక్టర్‌ను బాగా డిజైన్‌ చేశారని తెలిపింది. దిలీప్‌, పూనమ్‌ కౌర్‌, అక్షిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈనెలాఖరున ప్రారంభంకానుంది. విజయానంద్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎ.నరేందర్‌, విజయానంద్‌, సురేష్‌ గౌడ్‌ నిర్మిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రౌడీలు, గుండాలు గురించి నేర్చుకుంది విజయవాడలోనే : రామ్‌ గోపాల్‌ వర్మ