విలక్షణ పాత్రలకు తనదైన శైలిలో న్యాయం చేసే హీరో ప్రకాష్ రాజ్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా దక్షిణాదిలో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటుకున్న నటుడు ప్రకాష్ రాజ్. కానీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ అవకాశాలు లేక తెరమరుగయ్యాడు. ఒకప్పుడు టాప్ హీరోలతో సమానంగా ప్రకాష్ రాజ్ పారితోషికం ఉండేది. ఎంత భారీగా డిమాండ్ చేసిన అతనితోనే సినిమాలు చేయాల్సిన పరిస్థితి దర్శకనిర్మాతలకు గతంలో వచ్చింది. ఇన్నాళ్ళకు దర్శకులకు మంచిరోజులొచ్చాయి.
ఎందుకో తెలుసా...? రావు గోపాల రావు తనయుడిగా పరిశ్రమలోకి వచ్చి సొంత ఇమేజ్ సంపాదించుకున్న రావు రమేష్ హావా రోజురోజుకి పెరిగిపోవడంతో దర్శకనిర్మాతలు ఈయన ఇంటిముందూ క్యూ కడుతున్నారు. ప్రతి సినిమాలో ఇప్పుడు రావు రమేష్ కనిపిస్తున్నాడు. విలన్, తండ్రి, ఫ్రెండ్ ఇలా ప్రతి పాత్రలోనూ దర్శనమిస్తున్నాడు. ప్రస్తుతం రావు రమేష్ పూర్తిస్థాయి ఫాంలో ఉండడంతో అతను కోరిన పారితోషికాలు ఇస్తున్నారు. దాంతో రావు రమేష్ దెబ్బకి ప్రకాష్ రాజ్‌కు అవకాశాలు తగ్గిపోయాయి అనే ప్రచారం టాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది.