Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభాస్ "సలార్" ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ వెల్లడి...

Salaar Cease Fire movie review

వరుణ్

, శుక్రవారం, 19 జనవరి 2024 (18:19 IST)
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన "సలార్" చిత్రం గత నెల 22వ తేదీన విడుదలైన రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే, ఓటీటీలో స్ట్రీమింగ్ విషయంలో అభిమానుల్లో ఆత్రుత ఏర్పడింది. ఈ మూవీ ఎపుడెపుడు ఓటీటీలో వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త చెప్పింది. 
 
ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో "సలార్" ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ వస్తుందని అనుకున్నప్పటికీ అంతకన్నా ముందే ప్రేక్షకులను నెట్‌ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ చేసింది. పృథ్విరాజ్ సుకుమారన్, శృతిహాసన్, ఈశ్వరీరావు, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించిన విషయం తెల్సిందే. 
 
ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని విన్నపం.. దొంగ ఓట్లపై నిలదీయాలి : హీరో శివాజీ 
 
ప్రస్తుత రాజకీయాలపై సినీ హీరో శివాజీ సంచలన కామెంట్స్ చేశారు. సూట్ కేసులు ఇచ్చి బీఫామ్‌లు తెచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అలాగే, ఓటర్లు కూడా ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా వెలుగు చూస్తున్న దొంగ ఓట్లపై ప్రజలు నిలదీయాలని ఆయన కోరారు. దివంగత ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి దోపిడీకి తెరలేపలేదన్నారు. సహజవనరులను దోచుకోమని చెప్పలేదన్నారు. అలాంటి నాయకులు ఇపుడు లేరన్నారు. 
 
అనంతపురంలో జరిగిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని ప్రజలను కోరారు. డబ్బులు కోసం కాకుండా, మీ బిడ్డల కోసం ఓట్లు వేయాలని కోరారు. మంచి నాయకులను ఎన్నుకున్నపుడే ఎన్టీఆర్‌కు ఘన నివాళి ఇచ్చినట్టు అవుతుందన్నారు. దొంగ ఓట్లపై ప్రజలు నిలదీయాలని సూచించారు. 
 
ఇదేకార్యక్రమంలో మరో సినీ నటుడు నాగినీడు పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాను సాధించడంపై సినీ నటులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం సినీ నటులు తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని విన్నపం.. దొంగ ఓట్లపై నిలదీయాలి : హీరో శివాజీ