బాలివుడ్ ఖాన్‌ల కంటే ప్రభాస్ పెద్ద హీరోనా.. రాజమౌళి ఛాయ మాటేంటి?
ఒకే ఒక్క సినిమా బాహుబలితో బాలివుడ్ ఖాన్ త్రయాన్ని ప్రభాస్ మించిపోయాడని ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఉద్వేగంతో చేసిన ప్రకటన బాహుబలి2 ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి హాజరైన వారిని అలరించింది. సాధారణంగా మితభాషిగా ఉండే సెంథిల్ కుమార్ ప్రభాస్ విషయాని
ఒకే ఒక్క సినిమా బాహుబలితో బాలివుడ్ ఖాన్ త్రయాన్ని ప్రభాస్ మించిపోయాడని ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఉద్వేగంతో చేసిన ప్రకటన బాహుబలి2 ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి హాజరైన వారిని అలరించింది. సాధారణంగా మితభాషిగా ఉండే సెంథిల్ కుమార్ ప్రభాస్ విషయానికి వచ్చేసరికి కట్టలు తెంచుకున్నట్లుగా మాట్లాడేశారు. ప్రభాస్ నిబద్ధత గురించి బహుధా ప్రశంసించిన సెంథిల్ బాలివుడ్ ఖాన్ త్రయం షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కంటే పెద్ద నటుడని పొగిడేశారు.
నిజంగా కూడా ప్రభాస్ బాహుబలి సినిమాతో జాతీయ హీరో అయిపోయి ఉండవచ్చు. ఒకే ఒక్క సినిమా ప్రభాస్ రేంజ్‌ని ఎక్కడికో తీసుకెళ్లింది. అంతర్జాతీయ గుర్తింపు పొందాడు కూడా. బాహుబలి సినిమాకు ప్రాణప్రతిష్ట పోసిన ప్రభాస్ అంటే భారత్‌లో ఇప్పుడు ఆరాధనా భావం ఏర్పడిపోయింది. తొలి భాగంలో శివలింగాన్ని లేపి ఎత్తుకున్న ఆ భారీ రూపాన్ని చూసిన జనం దేశ విదేశాల్లో వెర్రెత్తి పోయారంటే ఆశ్చర్యం లేదు.
కానీ బాలీవుడ్ ఖాన్ త్రయం కంటే పెద్దవాడన్న సెంథిల్ ప్రకటనను ఎంతమేరకు తీసుకోవాలి అన్నదే సమస్య. ఖాన్ దాదాలతో ప్రభాస్‌ను పోల్చి చూసి అతడిని పైకెత్తడం ఇప్పటికిప్పుడు తొందరపాటు అంవుతుందని చెప్పాలి. ఎందుకంటే మొత్తం సినిమాను తమ భుజాలపైనే మోయగల సామర్థ్యత ఆ ముగ్గురు ఖాన్‌లకు ఉంది. వాళ్ల సినిమాలకు దర్శకుడెవరన్న దానితో పనిలేకుండానే భారీ కలెక్షన్లు వస్తుంటాయి.
వారితో పోల్చితే ప్రభాస్ ఇంతవరకు రాజమౌళి నీడలోనే ఎదుగుతూ వస్తున్నాడు. బాహుబలి అతడి స్థాయిని శిఖర స్థాయికి తీసుకుపోయినా, ఆ క్రెడిట్ మొత్తంగా రాజమౌళికే మొదటగా దక్కుతుంది. అందుకే ఇప్పటికిప్పుడే ఖాన్ త్రయంతో ప్రభాస్‌ను పోల్చడం తొందరపాటవుతుందని సినీ పండితుల వ్యాఖ్య.