Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. ఏంటది?

Advertiesment
ప్రభాస్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. ఏంటది?
, బుధవారం, 8 జులై 2020 (13:02 IST)
prabhas
టాలీవుడ్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కి శుభవార్త. ప్రభాస్ 20వ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్, టైటిల్‌ను జూలై 10న ఉదయం 10 గంటలకి విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ మేరకు ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ప్రభాస్ 20వ చిత్రం జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, పూజా హెగ్డే ఇందులో కథానాయికగా నటిస్తోంది.
 
ఈ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రభాస్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతుంది. ఇండస్ట్రీలో భారీ అంచనాలున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ ''మహానటి'' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు. ఈ సినిమాను వైజయంతి బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ డేటింగ్‌కు రమ్మని పిలిస్తే అస్సలు ఆలోచించను : స్వీటీ