Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ప్రాజెక్టు కె" నుంచి ప్రభాస్ మాస్ లుక్ రిలీజ్

Advertiesment
Project K
, బుధవారం, 19 జులై 2023 (17:25 IST)
వైజయంతీ మూవీస్ బ్యానరులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రాజెక్టు కె. ఇందులో విశ్వనటుడు కమల్ హాసన్ కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమా, ఇంతవరకూ 80 శాతానికి పైగా చిత్రీకరణను జరుపుకుందని అంటున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు.. పాన్ వరల్డ్ సినిమా అని దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. 
 
మరోవైపు, ఇది ప్రభాస్ చేస్తున్న ఫస్టు 'సైన్స్ ఫిక్షన్' మూవీ. ఇందులో ప్రభాస్ జోడీగా దీపిక పదుకొణె నటిస్తోంది. సైంటిస్ట్‌గా అమితాబ్ కనిపించనుండగా.. ప్రతినాయకుడి పాత్రను కమల్ పోషిస్తున్నారు. ఇక ఇతర ముఖ్యమైన పాత్రలలో వివిధ భాషలకి చెందిన నటీనటులు కనిపించనున్నారు. సాంకేతికపరంగా కూడా ఈ సినిమా అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇప్పటికే దీపిక ఫస్ట్‌లుక్‌ను వదిలిన టీమ్, కొంతసేపటి క్రితం ప్రభాస్ ఫస్టులుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
 
'అవెంజర్స్' తరహాలో ఒక డిఫరెంట్ లుక్‌తో ప్రభాస్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఆయన కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలబడుతుందని నాగ్ అశ్విన్ చెప్పిన మాట ఎంతవరకూ నిజమవుతుందనేది చూడాలి. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందనే ప్రచారం జరిగింది. కానీ అందులో నిజలేదని తేలిపోయింది. వచ్చే ఏడాది జనవరి 12 తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ ఏడో సీజన్.. ప్రోమో రిలీజ్