Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్‌ను కించపరిచేలా తీస్తే చెప్పుతో కొడతారు.. స్క్రీన్లు చింపేస్తారు: పోసాని

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత ఆధారంగా తెరకెక్కే చిత్రంలో ఎన్టీఆర్‌ను కించపరిచేలా, అవమానపరిచేలా చిత్రాన్ని తీస్తే మాత్రం చెప్పుతో కొడతారనీ, స్క్రీన్లు చింపేస్తారని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి హెచ్చరించారు

Advertiesment
ఎన్టీఆర్‌ను కించపరిచేలా తీస్తే చెప్పుతో కొడతారు.. స్క్రీన్లు చింపేస్తారు: పోసాని
, బుధవారం, 5 జులై 2017 (10:19 IST)
స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత ఆధారంగా తెరకెక్కే చిత్రంలో ఎన్టీఆర్‌ను కించపరిచేలా, అవమానపరిచేలా చిత్రాన్ని తీస్తే మాత్రం చెప్పుతో కొడతారనీ, స్క్రీన్లు చింపేస్తారని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ‘రామారావుగారిని అవమానపరుస్తూ బయోపిక్ తీస్తే, స్క్రీన్ ని చింపేస్తారు.. వెంటపడికొడతారు. ఆయనకు అవమానం జరిగినా, తక్కువ చేసి మాట్లాడినా చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. 
 
రాంగోపాల్ వర్మ అంటే నాకు గౌరవం ఉంది. రాముగారిని సినిమా తీయద్దని చెప్పే హక్కు నాకు లేదు. నాకు రామారావు గారు ఎవరెస్ట్ ఇన్ ఇండియా. దట్సాల్. ఆ ఎవరెస్ట్‌పై మచ్చపడొద్దు. నా తరపున, మీతరపున ద్వారా రామూ కైనా, ఎవరికైనా ఇదే నా రిక్వెస్ట్’ అని పోసాని అన్నారు. పుట్టిన ప్రతివ్యక్తి చనిపోయే వరకూ ఎన్నో గొప్ప పనులు చేసి ఉండొచ్చు కానీ, తనకు తెలియకుండానే పొరపాట్లు కూడా చేస్తాడు. నేనూ చేశాను. గొప్పవాళ్ళ జీవితాల్లో తెలియకుండా జరిగిన పొరపాట్లు చాలా ఉంటాయన్నారు. ఒక వ్యక్తికి సంబంధించిన నెగెటివ్ అంశాలను టచ్ చేయకూడదు. 
 
ఈ విషయాల్లో రామారావుగారు మచ్చలేని వ్యక్తి. బసవతారకం గారు చనిపోయే వరకు ఆమెను దేవతలా ప్రేమించారు. ఆమె కేన్సర్ వ్యాధితో మరణిస్తే చిన్నపిల్లాడిలా విలపించారు. ఆయన జీవితంలో ప్రతి అంశం నిజాయతీతో కూడుకున్నదే. ప్రజల కోసం వచ్చిన ఎన్టీఆర్ జీవితంలో అవినీతి లేదు. ఆయన సినీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలోనూ ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. చివరకు, లక్ష్మీపార్వతిగారిని కూడా రామారావుగారు మోసం చేయలేదు. నిజాయతీగా నిలబడి ఆమెతో చివరిదాకా ఉన్నారని గుర్తు చేశారు.
 
ఇక, రామారావుగారి జీవితంలో నెగెటివ్ ఏముంది? ఏమీ లేదు. ఇది వాస్తవం. నేనేమీ, రామారావుగారి తరపున వకాల్తా పుచ్చుకోవట్లా. ఆయనేమీ బతికిలేరు. ఆయన్ని కాకాపట్టి పదవి తీసుకోవడానికి. రామారావుగారు ఒక లెజెండ్.. అలా వదిలేయండి అని పోసాని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్‌పై బయోపిక్ తీయాలనే ఆలోచన విరమించుకోండి... ప్లీజ్ : పోసాని