Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమాన ప్రమాదంలో బ్రెజిల్ సింగర్ దుర్మరణం

Advertiesment
విమాన ప్రమాదంలో బ్రెజిల్ సింగర్ దుర్మరణం
, శనివారం, 6 నవంబరు 2021 (13:57 IST)
ఓ విమాన ప్రమాదంలో సింగర్ దుర్మరణం పాలయ్యారు. తాజాగా జరిగిన ఈ ప్రమాదంలో గ్రామీ అవార్డు విన్నర్ మారిలియా మెండోంకా మృతి చెందారు. ఆమె వ‌య‌స్సు 26 సంవ‌త్స‌రాలు. 
 
బ్రెజిల్ దేశానికి చెందిన గాయని మారిలియా మెండోంకా ఆమె మేనేజర్ మరియు సహాయకుడు మరికొందరితో కలిసి శుక్రవారం విమానంలో వెళుతువండగా, ఆ విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఆమెతో పాటు మేనేజర్‌ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హోతో పాటు పైలట్ , కో-పైలట్ ప్రాణాలు కోల్పోయారు. 
 
గెరైస్ రాష్ట్రంలోని గోయానియా నుండి క‌రాటింగాకు బ‌య‌లు దేరిన విమానం ప్ర‌మాదానికి గురైంది. విమానం కింద‌ప‌డ‌డానికి ముందు విద్యుత్ పంపిణీ లైన్‌ను ఢీకొట్టింద‌ని ప్ర‌భుత్వ రంగ విద్యుత్ సంస్థ సెమిగ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి 154కు బాబీ దర్శకత్వం.. మాస్ లుక్ రిలీస్