Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డైటింగ్‌ - డేటింగ్‌లపై జిగేల్ రాణి ఏమన్నారు...

పూజా హెగ్డే. సన్నగా.. నాజూగ్గా కనిపించే. "ఒక లైలా కోసం" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ భామ.. అల్లు అర్జున్ చిత్రం "దువ్వాడ జగన్నాథం" చిత్రంలో తన అందాలను ఆరబోసింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన 'ర

Advertiesment
డైటింగ్‌ - డేటింగ్‌లపై జిగేల్ రాణి ఏమన్నారు...
, మంగళవారం, 7 ఆగస్టు 2018 (12:13 IST)
పూజా హెగ్డే. సన్నగా.. నాజూగ్గా కనిపించే. "ఒక లైలా కోసం" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ భామ.. అల్లు అర్జున్ చిత్రం "దువ్వాడ జగన్నాథం" చిత్రంలో తన అందాలను ఆరబోసింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' చిత్రంలో జిగేల్ రాణిగా ఐటమ్ సాంగ్‌లో ఇరగదీసింది. ఇటీవల విడుదలైన "సాక్ష్యం" చిత్రంలో నటించింది. అలాగే, ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత' చిత్రంలోనూ, మహేష్ బాబు, ప్రభాస్ చిత్రాల్లో నటిస్తోంది. పనిలోపనిగా ఓ హిందీ చిత్రంలో నటిస్తోంది.
 
ఇలా నిత్యం బిజీగా గడిపే పూజా హెగ్డే ఫిట్నెస్‌ మంత్రం ఏంటి? వర్కవుట్స్‌ చేస్తారా? డైటింగ్‌ చేస్తారా? ఆ విషయంపై ఆమె వద్ద ప్రస్తావించగా, ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. 'నాకు డైటింగ్‌ మీద పెద్ద నమ్మకం లేదు. కాకపోతే ఏం తింటున్నానే విషయంపై శ్రద్ధ వహిస్తాను. జంక్‌ ఫుడ్స్‌కి దూరంగా ఉంటా. నా చిన్నతనం నుంచి నేను ఏమేం తిన్నానో, వాటికి దూరంగా ఉండను. అన్నం తినడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అందుకే ఇప్పుడు కూడా కడుపునిండా అన్నం తినడానికి వెనకాడను. ప్రతిరోజూ వర్కవుట్స్‌ చేస్తాను. శ్వాస తీసుకోవడానికి మర్చిపోనట్టే, వర్కవుట్స్‌ చేయడానికి కూడా ఏమాత్రం మర్చిపోను' అని చెప్పుకొచ్చింది. ఇక డేటింగ్‌కు ఆమడదూరంలో ఉంటానని చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా... అందాల రాశి