Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్‌బాస్‌కు నిత్యం టచ్‌లో ఉన్న ముమైత్ ఖాన్ పోలీసులకు దొరకడం లేదా.. నిజమేనా

హైదరాబాద్‌లో నగరంలో డ్రగ్స్ రాకెట్‌ను అతి సమర్థవంతంగా పట్టుకున్న పోలీసు విభాగం సెలబ్రిటీలందరికీ డ్రగ్స్ వాడకంపై నోటీసులు పంపించడంలో సఫలమైంది కానీ ఒక్కరికి నోటీసు పంపించడంలో మాత్రం నేటికీ విజయవంతం కాలేకపోతోంది. ఆమె ఎవరో కాదు ముమైత్‌ఖాన్. కానీ ఆశ్చర్యక

Advertiesment
Hyderabd police traced Mumaithkhan engaged bigboss
హైదరాబాద్ , మంగళవారం, 18 జులై 2017 (05:40 IST)
హైదరాబాద్‌లో నగరంలో డ్రగ్స్ రాకెట్‌ను అతి సమర్థవంతంగా పట్టుకున్న పోలీసు విభాగం సెలబ్రిటీలందరికీ డ్రగ్స్ వాడకంపై నోటీసులు పంపించడంలో సఫలమైంది కానీ ఒక్కరికి నోటీసు పంపించడంలో మాత్రం నేటికీ విజయవంతం కాలేకపోతోంది. ఆమె ఎవరో కాదు ముమైత్‌ఖాన్. కానీ ఆశ్చర్యకరమైనది ఏమిటంటే ఆమె ఇన్నాళ్లుగా బిగ్‌బాస్ కార్యక్రమానికి సంబందించిన పనుల్లో ఉంటూ బహరంగంగానే ఉంటోంది.
 
హైదరాబాద్ డ్రగ్స్‌ కేసులో అనుమానాలున్న సినీ ప్రముఖులందరికీ నోటీసులు పంపించిన ఎక్సైజ్‌ అధికారులు... ముమైత్‌ఖాన్‌ విషయంలో మాత్రం సఫలం కాలేకపోతున్నారు. ఆమె చిరునామాను పట్టుకోవడానికి ముప్పుతిప్పలు పడుతున్నారు. ముమైత్‌ ఇంటి అడ్రస్‌ విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల అధికారులు ఆమెకు నోటీసును చేరవేయలేకపోయారు. 
 
హైదరాబాద్‌లోని సోమాజీగూడలో ఒక టీచర్‌ ఇంటిలో ఆమె ఉంటున్నట్లు తెలియడంతో అక్కడకు పంపారు. కానీ... అక్కడ ఆమె లేకపోవడంతో నోటీసు అందలేదు. ముంబైలో సైతం ఆమె చిరునామా తెలుసుకోలేకపోయారు. 
 
ఆమె ప్రస్తుతం పుణె సమీపంలోని లొనావ్లా ప్రాంతంలో జరుగుతున్న ఒక టీవీ చానల్‌ షోలో పాల్గొంటున్నట్లు గుర్తించారు. బుధ, గురువారాల్లో అక్కడికి ఇద్దరు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లను పంపించి నోటీసును అందజేయాలని నిర్ణయించారు.
 
 
పోలీసులచే ప్రముఖుల విచారణ తేదీ
పూరి జగన్నాథ్‌ 19
చార్మి 20
ముమైత్‌ఖాన్‌ 21
తరుణ్‌ 22
శ్యామ్‌ కె నాయుడు 23
ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా 25
నవదీప్‌ 26
సుబ్బరాజు 27
నందు, రవితేజ 28
తనీష్‌ 28 తర్వాత

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ సీరియస్ షిట్: వర్థమాన నటి వ్యాఖ్యలపై తీవ్రదుమారం