నటి శ్రీవాణిపై దాడి కేసు.. అయ్యో రామా.. మా వదిన పిలిస్తేనే వెళ్లా... దాడి చేయలేదు : నటి శ్రీవాణి
పరిగికి చెందిన ఓ మహిళపై దాడి చేసిన కేసులో బుల్లితెర నటి శ్రీవాణిపై దాడి కేసు నమోదైంది. దీనిపై ఆమె స్పందించింది. తన వదిన అనూష పిలిస్తేనే పరిగి వెళ్లానని చెప్పుకొచ్చింది.
పరిగికి చెందిన ఓ మహిళపై దాడి చేసిన కేసులో బుల్లితెర నటి శ్రీవాణిపై దాడి కేసు నమోదైంది. దీనిపై ఆమె స్పందించింది. తన వదిన అనూష పిలిస్తేనే పరిగి వెళ్లానని చెప్పుకొచ్చింది. ఇంటి విషయంలో వివాదంపై స్పందించిన శ్రీవాణి ఏబీఎన్‌తో మాట్లాడుతూ పరిగిలో ఉన్న ఇల్లు మా నాన్న కోటేశ్వరరావు పేరిట ఉందన్నారు. తాము ఐదుగురం అక్కచెల్లెళ్లమని, మా నాన్న ఆస్తిలో తమకూ హక్కు ఉందని చెప్పుకొచ్చారు.
పైగా, డబ్బు సమస్య కాదని.. తానెవరిపై దాడి చేయలేదని స్పష్టంచేశారు. తమ అన్న బాబ్జీ గత నెలలో చనిపోయారని చెప్పారు. పరిగిలో తమ ఇంటి వద్ద ఈ స్థలం అనూషదని బోర్డు పెట్టారని, ఆ విషయమే తెలుసుకుందామని వెళ్లినట్లు వివరించారు.
వదిన అనవసరంగా తన ఫ్యామిలీని కేసులో ఇరికించిందని ఆరోపించారు. జరిగిన విషయాన్ని రంగారెడ్డి ఏఎస్పీ చందనాదీప్తికి తెలిపానన్న శ్రీవాణి పోలీసు విచారణకు సహకరిస్తామని చెప్పారు.