Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయిలూ.. నాతో నటించాలని వుందా.. అయితే మెయిల్ చేయండి : నాగార్జున

ప్రతిభ కలిగిన అమ్మాయిలకు కింగ్ నాగార్జున ఓ అరుదైన అవకాశాన్ని కల్పించారు. తనతో కలిసి నటించాలనుకునే అమ్మాయిలూ... అబ్బాయిలూ తనకు మెయిల్ చేయాలంటూ ఆయన కోరారు.

Advertiesment
nagarjuna
, బుధవారం, 27 జులై 2016 (16:26 IST)
ప్రతిభ కలిగిన అమ్మాయిలకు కింగ్ నాగార్జున ఓ అరుదైన అవకాశాన్ని కల్పించారు. తనతో కలిసి నటించాలనుకునే అమ్మాయిలూ... అబ్బాయిలూ తనకు మెయిల్ చేయాలంటూ ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఔత్సాహిక నటీనటులకు బంపర్ ఆఫర్ ఇస్తూ.. [email protected] అనే మెయిల్ ఐడీని కూడా ఇచ్చారు. టాలెంట్ కలిగి ఉండి, నటించాలని ఆసక్తి కలిగిన అన్ని వయసుల వాళ్లు తనకు మెయిల్ చేయాలని నాగార్జున సూచించారు.
 
ప్రస్తుతం నాగార్జున.. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో పోషించడంతో పాటు ఈ చిత్రానికి మ్యాట్రిక్స్ టీం వర్క్స్‌తో కలిసి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. మరోవైపు 'హాథిరామ్ బాబా' జీవిత చరిత్ర ఆధారంగా దర్శకేంద్రుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో కూడా నాగార్జున నటిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజినీకాంత్ సార్‌తో క్లోజ్‌గా ఉంటే షూటింగ్‌లో ఎలాంటి టెన్షన్ ఉండదు : నటి రాధికా ఆప్టే