Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"పెళ్లి సందD" హీరోయిన్ ఖరారు... కుర్ర పిల్లను ఎంచుకున్న దర్శకేంద్రుడు!!

Advertiesment
Pelli Sandadi Sequel
, బుధవారం, 28 అక్టోబరు 2020 (13:35 IST)
సీనియర్ హీరో శ్రీకాంత్ - రవణి - దీప్తి భట్నాగర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "పెళ్లి సందడి". 1996లో వచ్చిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. ఈ దృశ్యకావ్యాన్ని ప్రముఖ నిర్మాతలు సి.అశ్వినీదత్, అల్లు అరవింద్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇది తెలుగునాట థియేటర్లలో ఎంతటి సందడి చేసిందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది.
 
ఇపుడు ఏదే టైటిల్‌తో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడు ఈ చిత్రె నిర్మాణం జరుపుకోనుంది. ఈ చిత్రానికి నాటి చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తుండగా.. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. నాటి సినిమాకు సూపర్ హిట్ సంగీతాన్ని అందించిన కీరవాణి ఇప్పటి 'పెళ్లిసందD'కి కూడా మ్యూజిక్ చేస్తున్నారు.
webdunia
 
ఈ చిత్ర హీరోపై నిర్మాతలు ఇటీవలే అధికారిక ప్రకటన చేశారు. అలాగే తాజాగా ఈ చిత్రంలో నటించే కథానాయికను కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మలయాళ భామ మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. మొదట్లో కొత్త కథానాయికను ఎంపిక చేస్తారని భావించినప్పటికీ, చివరికి మాళవికను ఎంపిక చేశారు.
 
ఆర్కా మీడియా వర్క్స్ సంస్థతో కలసి కె. రాఘవేంద్రరావు సోదరుడు కె.కృష్ణమోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగును ప్రారంభించుకునే ఈ 'పెళ్లిసందD' మరెంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో వేచి చూడాలి. ఈ చిత్రం వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకురానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగుతున్న త్రివిక్రమ్