Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇకపై ఏడాదికి ఒక సినిమా చేస్తా: రాజ్‌ కందుకూరి

దర్శక నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించిన రాజ్‌ కందుకూరి ఈ ఏడాది 'పెళ్ళిచూపులు' చిత్రాన్ని నిర్మించి విజయాన్ని స్వంతం చేసుకున్నారు. ఆదివారంనాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు. 'పెళ్ల

Advertiesment
Pelli choopulu movie raj kanduri
, శనివారం, 8 అక్టోబరు 2016 (21:41 IST)
దర్శకనిర్మాతగా పలు చిత్రాలు నిర్మించిన రాజ్‌ కందుకూరి ఈ ఏడాది 'పెళ్ళిచూపులు' చిత్రాన్ని నిర్మించి విజయాన్ని స్వంతం చేసుకున్నారు. ఆదివారంనాడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు. 'పెళ్లిచూపులు' చిత్రం 75 రోజులను పూర్తి చేసుకుని వందరోజులు దిశగా వెళుతుంది. చిన్న బడ్జెట్‌తో చేసిన ఈ సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలని నేను, సురేష్‌ బాబు ఆలోచన చేసినప్పుడు, స్పెషల్‌ షోస్‌ వేద్దామనే ఆలోచన ఇద్దరికీ వచ్చింది. 
 
అందువల్ల సినిమా విడుదలకు ముందే స్పెషల్‌ షోస్‌ వేశాం. 'గౌతమబుద్ధ' సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. తొలి చిత్రంతో నంది అవార్డు, దలైలామా అవార్డు, వంశీ అకాడమీ అవార్డు వచ్చింది. తొమ్మిదేళ్ల సినీ జర్నీలో పది సినిమాలు చేశాను. కానీ పెళ్లిచూపులు సక్సెస్‌ నాకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. 
 
చాలామంది హీరోను బడ్జెట్‌ ఇంత ఉంది అంటూ స్టార్ట్‌ చేస్తారు. అయితే సినిమా కంటెంట్‌ కూడా చాలా ముఖ్యం. మంచి కథను తయారుచేసుకుని దానికి ఏ హీరో సరిపోతాడో అతని సినిమా చేస్తే మంచి విజయాన్ని సాధిస్తుంది. నా ధర్మపథ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఒకట్రెండు కోట్ల బడ్జెట్‌తో కొత్తవాళ్లతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతాను. భవిష్యత్‌లో ధర్మపథ క్రియేషన్స్‌, రాజ్‌ కందుకూరి అంటే కొత్తవాళ్లను ప్రోత్సహిస్తారనే పేరుంటే చాలు.
 
ఇకపై ఏడాదికి ఓ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అలాగే నా డైరెక్షన్‌లో కూడా సినిమా చేయాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతం ఐబిఎం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో వర్క్‌ చేసిన ఒక వ్యక్తి సినిమాలపై ఆసక్తితో మంచి సినిమా కథను తయారు చేసుకుని నా వద్దకు వచ్చాడు. కథ నచ్చడంతో విజయదేవర కొండ హీరోగా సినిమా చేస్తున్నాం. అలాగే తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో 'సైన్మా' సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతం కథను తయారుచేస్తున్నాడు. ఆ సినిమా ప్రారంభం కావడానికి రెండు, మూడు నెలల సమయం పడుతుంది. అలాగే ఓ స్టార్‌ హీరోతో కూడా సినిమా చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వాటి వివరాలను తెలియజేస్తానంటూ..వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సన్నీలియోన్‌ ప్రధాన పాత్రలో 'రాత్రి'