రోజుకు ఒక్క రూపాయి ఖర్చు చేయండి.. అన్‌లిమిటెడ్‌గా సినిమాలు చూడండి.. ఎలా?
రోజుకు ఒక్క రూపాయి ఖర్చు చేస్తే.. అన్‌లిమిటెడ్‌గా రీజినల్ సినిమాలు చూడొచ్చు. ఈ సౌకర్యం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఫాస్ట ఫిల్మ్జ్ అనే సంస్థ ఈ వెసులుబాటును
రోజుకు ఒక్క రూపాయి ఖర్చు చేస్తే.. అన్‌లిమిటెడ్‌గా రీజినల్ సినిమాలు చూడొచ్చు. ఈ సౌకర్యం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఫాస్ట ఫిల్మ్జ్ అనే సంస్థ ఈ వెసులుబాటును కల్పించనుంది.
ఇదే అంశంపై ఆ సంస్థ ప్రతినిధులు కె మల్హోత్రా, డొమినిక్ ఛార్లెస్‌లు మాట్లాడుతూ... ఫాస్ట్ ఫిల్మ్జ్‌లో రోజుకు ఒక్క రూపాయి ఖర్చు చేసి అన్‌లిమిటెడ్‌గా సినిమాలు చూడొచ్చని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ యాప్‌ను ఆవిష్కరించి, విడుదల చేసినట్టు తెలిపారు.
వినోవా లిమిటెడ్ వారి పెర్‌ష్యూస్ టెక్నాలజీ దేశంలో తొలిసారి వాడటం వల్ల 2జీ వేగంతో పనిచేసే మొబైళ్లలో సైతం హెచ్‌డీ నాణ్యతగల వీడియోని చూడొచ్చన్నారు. వంద శాతం లీగల్‌గా సినిమాలు, సన్నివేశాలు కలిగిన వీడియోలు చూడొచ్చన్నారు. కేవలం 150 ఎంబీ డాటాతోనే పూర్తి సినిమాని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని.. అదే తమ యాప్ గొప్పతనమన్నారు.