Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేల టిక్కెట్టు ఆడియో ఫంక్షన్‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తున్నారా..?

సోగ్గాడే చిన్ని నాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం.. చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించి టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం నేల టిక్కెట్టు. ఈ చిత్రంలో ర‌వితేజ‌, మాళ‌విక శ‌ర్మ జంట‌గా న‌టించారు. రామ్ తాళ్లూరి ఈ సినిమాని ఏమాత్రం

Advertiesment
నేల టిక్కెట్టు ఆడియో ఫంక్షన్‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తున్నారా..?
, బుధవారం, 2 మే 2018 (19:05 IST)
సోగ్గాడే చిన్ని నాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం.. చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించి టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం నేల టిక్కెట్టు. ఈ చిత్రంలో ర‌వితేజ‌, మాళ‌విక శ‌ర్మ జంట‌గా న‌టించారు. రామ్ తాళ్లూరి ఈ సినిమాని ఏమాత్రం రాజీప‌డ‌కుండా నిర్మించారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోన్న ఈ మూవీని ఈ నెల 24న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
 
ఈ లోగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే... ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ విషయంగానీ .. ముఖ్య అతిథి విషయం గాని అధికారికంగా ఖరారు కాలేదని తాజాగా డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ ట్వీట్ చేశాడు.
 
మరి ఇదే విషయాన్ని అధికారికంగా చెబుతారో.. కొత్త నిర్ణయమేదైనా చెబుతారో చూడాలి. ఈ సినిమాకి శక్తికాంత్ సంగీతాన్ని అందించాడు. మాస్ టైటిల్‌తో కూడిన ఈ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందడం విశేషం. మ‌రి.. ఈ మూవీతో క‌ళ్యాణ్ కృష్ణ హ్యాట్రిక్ సాధిస్తాడేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హత్య చేయిస్తారా? పవన్ అభిమానులతో కొట్టిస్తారా? శ్రీరెడ్డి ప్రెస్ మీట్(Video)