దాసరికి పవన్ పరామర్శ... ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన చంద్రబాబు
సినీ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ రావుని హీరో పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఊపిరితిత్తులు, కిడ్నీ, అన్నవాహిక సమస్యలతో బాధపడుతున్న దాసరి ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వి
సినీ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ రావుని హీరో పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఊపిరితిత్తులు, కిడ్నీ, అన్నవాహిక సమస్యలతో బాధపడుతున్న దాసరి ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కిమ్స్ వైద్యులు ఆయనకు బుధవారం అత్యవసరంగా ఓ ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారు.
బుధవారం సాయంత్రం దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత శరత్ మరార్‌తో కలసి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన పవన్.. దాసరిని పరామర్శించారు. దాసరికి చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొన్నారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. "దాసరి అనారోగ్యం వార్త బాధ కలిగించింది. ఆయన ఆరోగ్యంపై వైద్యులు నమ్మకంగా ఉన్నారని, ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
మరోవైపు.. దాసరి నారాయణ రావు ఆరోగ్య పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఆరా తీశారు. ఈ మేరకు ఆయన దాసరి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాసరి త్వరలోనే కోలుకుంటారని కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.