Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ వరద బాధితుల రూ.6 కోట్ల భారీ విరాళం, అల్లు అర్జున్, నాగార్జున కుటుంబం, అలీ విరాళం

pawan, nag, arjun, ali

డీవీ

, బుధవారం, 4 సెప్టెంబరు 2024 (15:34 IST)
pawan, nag, arjun, ali
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరియు వరదల కారణంగా సంభవించిన విధ్వంసాన్ని చూసి చలించిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారీ విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందించనున్నారు. అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడ్డ 400 పంచాయతీలకు.. ఒక్కో పంచాయతీకి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4 కోట్లు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు.
 
మొత్తంగా, పవన్ కళ్యాణ్ ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిపి వ్యక్తిగతంగా రూ. 6 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మరియు పంచాయతీరాజ్ మంత్రిగా రాష్ట్రంలోని ప్రతి వరద ప్రభావిత ప్రాంతం వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండంతో పాటు, ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

సామాజిక సేవలతో పాటు, ఎవరికైనా ఆపద వస్తే ఆపన్నహస్తం అందించే వారి జాబితాలో ముందుంటారు హీరో అల్లు అర్జున్‌. ఇంతకు ముందు పలు మార్లు తన సహాయంతో మంచి మనసు చాటుకున్న ఈ కథానాయకుడు మరోసారి తన ఉదారతను చూపాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరద ముంపులో చిక్కుక్కుని సహాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులకు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అహార్నిశాలు శ్రమిస్తూ వారిని ఆదుకుంటున్నారు.

ఇక వారి వరద వల్ల సర్వం కోల్పోయిన బాధితుల కోసం హీరో అల్లు అర్జున్‌ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తన వంతు సహాయంగా కోటి రూపాయాల విరాళం అందించడానికి ముందుకు వచ్చారు. వరదల వల్ల త్రీవంగా నష్టం పోవడం తనకు ఎంతో భాదను కలిగిస్తుందని, అందరూ త్వరితగతిన ఈ విపత్తను నుండి బయటపడాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నానని తెలిపారు అల్లు అర్జున్‌.
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద సహాయక కార్యక్రమాల కోసం రూ. కోటి సాయంగా అందిస్తున్న అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్ 
 
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుంటారు. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నాం. 
 
"ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాము. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం' 
 
విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ డొనేషన్ ని అందజేస్తున్నాయి.
 
తెలుగు రాష్ట్రాలకు 6లక్షల సాయం– అలీ, జుబేదాఅలీ
తెలుగు రాష్ట్రాలకు వరదల వల్ల ఎంతగా నష్టం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల పరిస్థితిని చూసి నేను నా భార్య జుబేదా ఎంతో బాధపడ్డాం. మా వంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఆరు లక్షల (ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణాకు 3 లక్షలు) రూపాయలను సీయం రిలీఫ్‌ ఫండ్‌కు అందచేస్తాం అని ప్రముఖ నటుడు అలీ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాగిణి ద్వివేది ప్రధానపాత్రలో జనార్ధన మహర్షి రూపొందిస్తున్న చిత్రం శ్లోక ఫస్ట్‌లుక్‌