Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ బర్త్‌డే గిఫ్ట్ : కేజీ ఉల్లి రూ.2 వేలకు అమ్మిన పవర్ స్టార్ ఫ్యాన్స్.. ఎందుకు?

జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, శుక్రవారం ఉదయం నుంచే ఆలయాల్లో పవన్ పేరిట ప్రత్యేక పూజలు, అభిషేకా

పవన్ కళ్యాణ్ బర్త్‌డే గిఫ్ట్ : కేజీ ఉల్లి రూ.2 వేలకు అమ్మిన పవర్ స్టార్ ఫ్యాన్స్.. ఎందుకు?
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (08:42 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, శుక్రవారం ఉదయం నుంచే ఆలయాల్లో పవన్ పేరిట ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు చేయిస్తున్నారు. అలాగే, ఉదయం నుంచి అల్పాహార, అన్నదాన కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు కొంతమంది చేస్తుంటే.. మరికొందరు మాత్రం ప్రాణదానం చేసేందుకు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి వైద్య సేవల ఖర్చు కోసం ఉల్లిపాయలను విక్రయించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
వెస్ట్ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవకు చెందిన లావణ్య అనే చిన్నారి ఫాన్సోనిస్‌ ఎనీమియా అనే వ్యాధితో బాధపడుతోంది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. శస్త్రచికిత్సకు రూ.12 లక్షలవుతుందని చెప్పారు. కూలీ చేసుకుని బతికే లావణ్య తల్లిదండ్రులకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతల సహకారం కోరారు. 
 
ఈ విషయం తెలిసిన పవన్‌ అభిమానులు.. ఉల్లిపాయలు అమ్మి సాయం చేయాలని భావించారు. పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో దుకాణం తెరిచి.. పట్టణమంతా ప్రచారం చేశారు. స్పందించిన దాతలు కొందరు రూ.200, రూ.500.. రూ.1000 పెట్టి కొంటే మరికొందరు రూ.2 వేలు పెట్టి కొనుగోలు చేశారు. ఇలా, వారు తెచ్చిన 100 కేజీల ఉల్లిపాయలు గంటలో అమ్ముడుపోగా, వీటి ద్వారా రూ.50 వేలు వచ్చాయి. ఈ మొత్తాన్ని పవనకల్యాణ్‌ పుట్టినరోజైన శుక్రవారం చిన్నారి తల్లితండ్రులకు అందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మనవి' అనుకోవడంలో తృప్తి వేరు.. ఏం చేస్తే... అది వడ్డీతో సహా తిరిగొస్తుంది: సమంత