Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మనవి' అనుకోవడంలో తృప్తి వేరు.. ఏం చేస్తే... అది వడ్డీతో సహా తిరిగొస్తుంది: సమంత

త్వరలో ఓ ఇంటికి కోడలిగా వెళ్లనున్న హీరోయిన్ సమంత ఇపుడు హితోపదేశాలు చేస్తోంది. ప్రతి చర్యకూ ఓ ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని చెపుతోంది.

'మనవి' అనుకోవడంలో తృప్తి వేరు.. ఏం చేస్తే... అది వడ్డీతో సహా తిరిగొస్తుంది: సమంత
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (06:54 IST)
త్వరలో ఓ ఇంటికి కోడలిగా వెళ్లనున్న హీరోయిన్ సమంత ఇపుడు హితోపదేశాలు చేస్తోంది. ప్రతి చర్యకూ ఓ ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని చెపుతోంది. 
 
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రం సెప్టంబర్ ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో సమంత ఓ హీరోయిన్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మనం సానుకూల దృక్పథంతో ఈ ప్రపంచాన్ని చూస్తే... ప్రపంచం కూడా మనల్ని అలానే చూస్తుంది. మనం ఎంత ప్రేమిస్తే... అంత తిరిగి ఖచ్చితంగా వస్తుంది. ఈ విషయం తెలుసుకొన్నాక నా ఆలోచన దృక్పథం మారిందని చెపుతోంది. 
 
'మన ఆలోచనల్ని బట్టి మనదృష్టి... మనదృష్టిని బట్టి మన పనులు ఆధారపడి ఉంటాయి. మనం ఏంచేస్తే... అది వడ్డీతో సహా తిరిగొస్తుంది. పాపమైనా, పుణ్యమైనా, ప్రేమ అయినా అంతే. తీసుకోవడానికి సిద్ధమైనప్పుడు ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే మనకు ఒకరి దగ్గర తిరిగిపొందే అర్హత లభిస్తుంది. అందుకే ఏవీ నావి అనుకోను. ‘మనవి’ అనుకోవడంలో తృప్తి వేరు. పంచుకోవడంలో ఉన్న ఆనందం ఎక్కడా లేదు' అని చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫంక్షన్‌కు వచ్చి విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన... పోలీసుల కస్టడీలో నటుడు