Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగాస్టార్ ఖైదీ 150పై నోరెత్తని పవన్.. వర్మపై తమ్ముడికి కోపం రాలేదా? ఇలా తయారయ్యాడేంటి?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా సంక్రాంతికి విడుదలై సంచలనం సృష్టించింది. కలెక్షన్ల పరంగా, నటనా పరంగా చిరంజీవి కుమ్మేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ప్రశంసల వర్

Advertiesment
Pawan Kalyan
, శుక్రవారం, 13 జనవరి 2017 (17:00 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా సంక్రాంతికి విడుదలై సంచలనం సృష్టించింది. కలెక్షన్ల పరంగా, నటనా పరంగా చిరంజీవి కుమ్మేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అన్నయ్య సినిమా ఇలా టాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేస్తుంటే.. తమ్ముడు మాత్రం సినిమా రిలీజై మూడు రోజులైనప్పటికీ నోరెత్తలేదు. 
 
అన్నయ్య సినిమా విజయానికి అన్ని విధాలా సహకరిస్తానని చెప్పిన జనసేనుడు పవన్ కళ్యాణ్ కనిపించడంలేదు వినిపించడం లేదేంటి? అంటూ కామెంట్లు పడుతున్నాయి. ఎంత ఎదిగినా అన్న మాటలకు ఒదిగి ఉండేవాడినని వందల సార్లు చెప్పుకున్నా.. పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి ఖైదీ గురించి నోరు విప్పకపోవడం చర్చనీయాంశమైంది. 
 
చిరంజీవి సినిమాపై సొంతగళం వినిపించకపోతే సరే... తన అన్నయ్యను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లాంటివాళ్ల ట్విట్లర్లో మంట రాజేస్తున్న కామెంట్లపై కూడా పవన్ మార్క్ రియాక్షన్ రాకపోవడంపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఖైదీ ఫంక్షన్‌కు రాకపోవడం.. అందుకు కారణం చెప్పడం.. ప్రస్తుతం సినిమాపై ఏమాత్రం ఫీడ్ బ్యాక్ ఇవ్వకపోవడం వెనక అసలు కారణం ఏమైనా ఉందా అంటూ మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పవన్ ఇలా తయారయ్యాడేంటి అంటూ మెగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖైదీ సినిమాను హైదరాబాదులో పవన్ చూసేసారని.. హ్యాపీగా ఫీలైయ్యారని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.600కోట్లతో మహాభారతం.. భీముడిగా మోహన్‌లాల్: నాగ్ కీలక పాత్ర-ద్రౌపదిగా ఐష్-అర్జునుడిగా విక్రమ్..