Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోసం చేసిన నిర్మాత శరద్‌ మమార్‌, పవన్ మేనేజర్ శ్రీను

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమా వల్ల రూ.కోటి 86 లక్షలు నష్టపోయాననీ.. దానికి కొంత పరిహారంగా తర్వాతి చిత్రాన్ని ఇస్తామని.. చిత్ర నిర్మాత శరద్‌మరార్‌, పవన్‌ మేనేర్‌ శ్ర

Advertiesment
pawan kalyan. manager
, సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (17:02 IST)
పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమా వల్ల రూ.కోటి 86 లక్షలు నష్టపోయాననీ.. దానికి కొంత పరిహారంగా తర్వాతి చిత్రాన్ని ఇస్తామని.. చిత్ర నిర్మాత శరద్‌మరార్‌, పవన్‌ మేనేర్‌ శ్రీను ఇచ్చిన మాటను తప్పి మోసం చేశారని సంపత్‌కుమార్‌ విమర్శిస్తున్నారు. విజయవాడకు చెందిన టాలీవుడ క్రియేషన్స్‌ డిస్ట్రిబ్యూటర్‌ అయిన సంపత్ కుమార్ సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల ముందుకు వచ్చారు. 
 
కృష్ణా జిల్లాను రూ.4 కోట్ల 38 లక్షలకు కొంటే రూ.2 కోట్ల 52 లక్షలు మాత్రమే వచ్చాయని రూ.1.86 నష్టం వచ్చిందనీ.. ఇది తెలిసిన వెంటనే.. నష్టపోయిన బయ్యర్లకు మరో సినిమా ఇస్తామని అప్పట్లో చెప్పిన నిర్మాత.. ప్రస్తుతం దాటవేస్తూ బెదిరింపులకు దిగుతున్నామని వాపోయారు. నష్టంరాని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే పవన్‌ నూతన చిత్రాన్ని ఇస్తూ వారిని నష్టపోయిన వారి జాబితా కింద చూపిస్తూ తప్పుదోవపట్టిస్తున్నారని దుయ్యబట్టారు. 
 
విడుదలకుముందు సంస్థ కార్యాలయంలో తర్వాత చిత్రం ఇస్తామని చెప్పిన వారు.. ఇప్పుడు అస్సలు పట్టించుకోవడంలేదనీ.. అదేమి అడిగితే.. పరువు నష్టం దావా వేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. సినిమాను కొనేటప్పుడు మేనేజర్‌ శ్రీను.. శతర్‌మారర్‌ సోమవారం కంపెనీ వారిని పరిచయం చేసి అగ్రిమెంట్‌మీద సంతకం చేయించారనీ.. ఇంగ్లీషులో ఉండడంతో నేను చదవలేకపోయాననీ ప్రస్తుతం అడిగితే సంతకం పెట్టావ్‌ కదా అంటూ తిరిగి ఎదురు దాడి దిగుతున్నారని ఇప్పటికే రెండుసార్లు పవన్‌ను సంప్రదిస్తే శ్రీను కలవనీయలేదనీ మీడియా ద్వారా అయితేనే పవన్‌కు తెలుస్తుందని ఇలా వచ్చానని వెల్లడించారు. తక్షణమే. పవన్‌కళ్యాణ్‌ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ విషయమై నిర్మాత శరద్‌మరార్‌ను సంప్రదిస్తే తను చెప్పేది అబద్దమని అన్ని రికార్డ్‌గా వున్నాయంటూ వెంటనే కట్‌ చేయడం 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంద్రగంటి మల్టీస్టారర్‌లో అంతా తెలుగువారే