Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లండన్‌లో పవన్ కళ్యాణ్.. యూకేటీఏలో వేడుకల్లో ఏం చెప్పాడంటే?

Advertiesment
Pawan Kalyan
, ఆదివారం, 10 జులై 2016 (16:37 IST)
యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ (యూకేటీఏ) ఆరో వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు లండన్‌కు వెళ్లారు. సుమారు 1500 మంది పాల్గొన్న ఈ వేడుకలకు ప్రముఖ సినీ నటులు శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... కళ మనకు నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తూ, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేదిగా ఉండాలన్నారు. కళ అనేది సంస్కృతి లో అంతర్భాగమని, మన భాషని, యాసని మర్చిపోకూడదన్నారు. 
 
తన సినిమాల ద్వారా సంప్రదాయాల్ని ప్రోత్సహిస్తానని, వివిధ తెలుగు ప్రాంతాల జానపద గీతాలు తన సినిమాల్లో ఉండేలా చూస్తానని జానపదం గురించి ప్రస్తావించి చెప్పారు. తెలుగు సంప్రదాయాల్ని భావితరాలకు పంచేందుకు ఈ తరహా ఉత్సవాలు ఎంతో సాయం చేస్తాయని అభిప్రాయపడ్డారు. తెలుగు సంస్కృతి మరియు కళలను భావి తరాల వారికి అందించటంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని, దీనికి ప్రవాస ఆంధ్రులు చేస్తున్న కృషిని కొనియాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ స్టార్‌తో కొత్త కాపురం పెట్టిన అల్లు శిరీష్ హీరోయిన్!