రూ.100 నోటుతో రూ.2000 నోటును చెక్ చేస్తున్న 'కాటమరాయుడు' పవన్ కళ్యాణ్... ఏం చెప్తారో?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆయనా చిత్రం చేస్తుండగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లు రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేశారు. ఆ స్థానంలో రూ. 2000 కొత్తనోట్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. పెద్ద నోట్లు రద్దు చే
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆయనా చిత్రం చేస్తుండగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లు రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేశారు. ఆ స్థానంలో రూ. 2000 కొత్తనోట్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇంత హడావుడిగా పెద్దనోట్లు విడుదల చేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. సామాన్యులు కష్టపడుతారన్న ముందుచూపుతో అమలు చేసినట్లయితే బావుండేదని అన్నారు. తాజాగా ఆయన కాటమరాయుడు చిత్రం షూటింగ్ సమయంలో రూ.2000 నోటును ఆయన పరిశీలనగా చూస్తూ ఉండటం కనిపించింది. ముఖ్యంగా రూ. 100 నోటుతో పోల్చి రూ. 2000 నోటును చూస్తున్నారు. ఈ పరిశీలన తర్వాత రూ.2000 నోటుపై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో...?