Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'దిల్' రాజు భార్య అనితకు నివాళి.. పవన్ కళ్యాణ్

సినీ పరిశ్రమ ప్రముఖుడు, నిర్మాత దిల్ రాజు భార్య శ్రీమతి అనిత మరణించారనే సమాచారాన్ని విదేశాలలో 'కాటమరాయుడు' షూటింగులో విని నమ్మలేకపోయాను. ఈ వార్త నిజం కాకూడదని అనుకున్నాను.

Advertiesment
'దిల్' రాజు భార్య అనితకు నివాళి.. పవన్ కళ్యాణ్
, సోమవారం, 13 మార్చి 2017 (10:21 IST)
సినీ పరిశ్రమ ప్రముఖుడు, నిర్మాత దిల్ రాజు భార్య శ్రీమతి అనిత మరణించారనే సమాచారాన్ని విదేశాలలో 'కాటమరాయుడు' షూటింగులో విని  నమ్మలేకపోయాను. ఈ వార్త నిజం కాకూడదని అనుకున్నాను. ఎందుకంటే  రాజు, అనితలది అంత అన్యోన్యమైన దాంపత్యం. నాకు దిల్ రాజు సినీ పరిశ్రమలో ఉన్న కొందరు ఆత్మీయుల్లో ముఖ్యమైన వ్యక్తి. అటువంటి ఆత్మీయ వ్యక్తికి ఇంతటి కష్టం రావడం నా మనసును ఎంతో కలచివేస్తోంది.
 
దిల్ రాజు నిర్మించే చాల చిత్రాలకు శ్రీమతి అనిత సమర్పకురాలిగా ఉండేవారు. ఆలా ఆమెకు కుడా సినీ పరిశ్రమతో సంబంధ బాంధవ్యాలు వున్నాయి . నాలుగున్నర పదుల వయస్సులోనే ఆమె అకాల మరణం చెందడం రాజు కుటుంబానికి తీరని లోటు. ఊహించని ఈ విపత్తును తట్టుకోడానికి రాజుకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని, శ్రీమతి అనిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నారైలకు సూపర్ గిఫ్ట్.. ఎన్నారైలకు మహాభారతం పుస్తకాలు.. వందల కార్లలో ర్యాలీగా?