Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణంరాజు మరణం దిగ్బ్రాంతికరం : పవన్ కళ్యాణ్

కృష్ణంరాజు మరణం దిగ్బ్రాంతికరం : పవన్ కళ్యాణ్
, ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (10:46 IST)
సీనియర్ హీరో కృష్ణంరాజు మృతిపట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు కృష్ణంరాజు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. 
 
నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలికాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
 
మా కుటుంబంతో కృష్ణంరాజుకి స్నేహసంబంధాలు ఉన్నాయి. 1978లో ‘మన వూరి పాండవులు’ చిత్రంలో కృష్ణంరాజుతో కలసి అన్నయ్య చిరంజీవి నటించారు. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ‘భక్త కన్నప్ప’లో కృష్ణంరాజు అభినయం ప్రత్యేకం. అందులో శివ భక్తిని చాటే సన్నివేశాలను రక్తి కట్టించారు. బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, తాండ్ర పాపారాయుడు, మహ్మద్ బిన్ తుగ్లక్, పల్నాటి పౌరుషం వంటి అనేక చిత్రాలు ఆయన శైలి నటనను చూపాయి. 
 
ప్రజా జీవితంలోనూ ఆయన ఎంతో హుందాగా మెలిగారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ తరఫున బరిలో నిలిచారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. కృష్ణంరాజు కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను" అని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణంరాజు ఇకలేరు.. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించి రెబెల్‌స్టార్‌గా...