Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24న సెట్స్‌పైకి ''కాటమరాయుడు''.. పవన్ కోసం కొరటాల స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడా?

జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ టాప్ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత గ్యాప్ తీసుకుని.. పొలిటికల్‌ కార్యక్రమాలతో బిజీ అయ్యారు. కానీ ప్రస్తుతం పవన్

Advertiesment
Pawan Kalyan Announced Katamarayudu Shooting Start Date
, సోమవారం, 12 సెప్టెంబరు 2016 (17:13 IST)
జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ టాప్ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత గ్యాప్ తీసుకుని.. పొలిటికల్‌ కార్యక్రమాలతో బిజీ అయ్యారు. కానీ ప్రస్తుతం పవన్ ''కాటమరాయుడు'' సినిమా ఈ నెల 24న సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ షూటింగ్‌లో పవన్ పాల్గొంటాడు. ‘గోపాల గోపాల’ ఫేం డాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ముందుగా ఈ చిత్రానికి ‘కడప కింగ్‌’ అనే టైటిల్‌ని పరిశీలించారు. అయితే, ఆ టైటిల్‌ అంత క్యాచీగా లేదని భావించి, చివరికి ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పాపులర్‌ అయిన ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా..’ పాటలోంచి ‘కాటమరాయుడు’ని తీసుకుని టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. చిత్రానికి శరత్ మారార్ నిర్మాత.
 
మరోవైపు మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలతో హిట్ డైరక్టర్‌గా పేరు కొట్టేసిన కొరటాల శివ.. పవన్ కల్యాణ్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్. డైలాగ్ రైటర్‌ నుంచి డైరక్టర్ స్థాయికి పెరిగిన కొరటాల శివ.. హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. 
 
ప్రస్తుతం కొరటాల శివ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సరిపడా స్టోరీ రెడీ చేయబోతున్నాడట. మహేష్, ప్రభాస్‌లతో రెండో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్న కొరటాల శివ.. పవన్‌తోనూ మూవీ చేసేందుకు సర్వం ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిసింది. కాటమరాయుడు తర్వాత కొరటాల శివ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నట్లు తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖకు ఎపుడొచ్చినా చేప తలకాయ కూర ఇష్టంగా తింటా.. హీరో విక్రమ్