Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ పరిశ్రమలో మరో విషాదం.. రాజ్‌కుమార్ సతీమణి కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. కర్నాటక సినీ దిగ్గజం రాజ్‌కుమార్‌ సతీమణి కన్నుమూసింది. ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు కన్నుమూసిన కొన్ని గంటల్లోనే లెజండరీ నటుడు, కన్నడ కంఠీరవం రాజ్‌కుమార

Advertiesment
సినీ పరిశ్రమలో మరో విషాదం.. రాజ్‌కుమార్ సతీమణి కన్నుమూత
, బుధవారం, 31 మే 2017 (09:32 IST)
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. కర్నాటక సినీ దిగ్గజం రాజ్‌కుమార్‌ సతీమణి కన్నుమూసింది. ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు కన్నుమూసిన కొన్ని గంటల్లోనే లెజండరీ నటుడు, కన్నడ కంఠీరవం రాజ్‌కుమార్‌ సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్‌ బుధవారం తుదిశ్వాస విడిచారు. కిడ్నీ, శ్వాసకోశ సమస్యలతో ఎంఎస్‌.రామయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున 4.40 గంటలకు కన్నుమూశారు.
 
78 ఏళ్ల పార్వతమ్మ ఆరోగ్యం విషమించడంతో ఈ నెల 14న ఆస్పత్రిలో చేరింది. అప్పటి నుంచి కృత్రిమ శ్వాసపై మీద ఉన్న ఆమెకు వైద్యులు ప్రత్యేక శస్త్ర చికిత్సలు నిర్వహించినా లాభంలేకపోయింది. పూర్ణ ప్రంగ వాటికలో ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భర్త రాజ్‌కుమార్‌ తరహాలోనే పార్వతమ్మ కూడా తన రెండు కళ్లను దానం చేశారు.
 
రాజ్‌కుమార్ ‌- పార్వతమ్మ దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం. వీరి తనయులైన పునీత్‌ రాజకుమార్‌, శివరాజ్‌కుమార్‌ ప్రస్తుతం కన్నడ అగ్ర హీరోలుగా ఉన్నారు. నిర్మాతగా కూడా పార్వతమ్మ తనదైన ముద్ర వేశారు. ఆమె అప్పు, అరసు, వంశీ, హుడుగారు, అభి వంటి సినిమాలను తెరకెక్కించారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దర్శక దిగ్గజం దాసరి మృతి.. కన్నీరుమున్నీరవతున్న తోలుకట్ట గ్రామ వాసులు.. ఎందుకు?