Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆసక్తికర సన్నివేశాలతో పరమపద సోపానం టీజర్

Advertiesment
Parama sopanam
, శనివారం, 24 జూన్ 2023 (13:35 IST)
Parama sopanam
మాఫియా అక్రమాల నేపథ్యంలో SS  మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న కొత్త సినిమా పరమపద సోపానం. గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ అంబటి హీరోగా నటిస్తుండగా ఆయన సరసన జెన్నిఫర్ హీరోయిన్ గా నటిస్తోంది. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుతున్న యూనిట్.. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.
 
ఆయువు కోసం అరువులు చాస్తూ నోరు తెరిచిన కాల సర్పం కంట పడకుండా.. ఎగిరిపోవాలి అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో ఆసక్తికర ఎలిమెంట్స్ చూపించారు. సినిమా సోల్ తెలిసేలా యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసి కథపై క్యూరియాసిటీ పెంచారు. టీజర్ లో వినిపించిన ఒకటి రెండు డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మాఫియా ప్రధానంగా ఈ మూవీ రూపొందుతోందని స్పష్టం చేస్తూ వదిలిన ఈ టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందని చెప్పుకోవచ్చు.
 
ఈ చిత్రంలో అజయ్ రత్నం, పిల్లా ప్రసాద్, జ్యోతి, అనంత్, చింటూ, భాషా, సంతోష్, నమ్రిత - ఐటెం సాంగ్ డాన్సర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. రాంబాబు గోశాల లిరిక్స్ రాశారు. గీతామాధురి
పృద్వి  చంద్ర, హరిప్రియ, అదితి భావరాజు, యశస్వి కొండేపూడి సాంగ్స్ పాడారు. శివ శంకర్ మాస్టర్, యానీ మాస్టర్, సాయితేజ కొరియోగ్రఫీ అందించారు. దేవి శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేయగా.. సత్య మహావీర్ సంగీతం అందించారు.
 
ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నాగ శివ తీసుకోగా.. గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గౌతమ్ రాజ్ నెరుసు ఎడిటర్ గా, గణపర్తి నారాయణ రావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, గుడిమిట్ల ఈశ్వర్ కో - ప్రొడ్యూసర్ గా బాధ్యతలు చేపట్టారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్, ఇతర వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

90 బ్యాక్ డ్రాప్ లో అన్నపూర్ణ ఫోటో స్టూడియో : డైరెక్టర్ మారుతి