Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమాల్లో నటించడానికి వీల్లేదన్న భర్త.. విడాకులు తీసుకున్న శృంగార నటి

పాకిస్థాన్‌కు చెందిన బాలీవుడ్ శృంగార నటి వీణా మాలిక్. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో మంచి పాపులర్ అయింది. ఫలితంగా బాలీవుడ్ అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. దీంతో భారతీయ సినీ ప్రేక్షకుల మనస్

Advertiesment
Pakistani Actress Veena Malik
, సోమవారం, 13 మార్చి 2017 (13:16 IST)
పాకిస్థాన్‌కు చెందిన బాలీవుడ్ శృంగార నటి వీణా మాలిక్. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో మంచి పాపులర్ అయింది. ఫలితంగా బాలీవుడ్ అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. దీంతో భారతీయ సినీ ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ముఖ్యంగా పలు శృంగార చిత్రాల్లో తన అందచందాలు ఆరబోసింది. 
 
మంచి పీక్ స్టేజ్‌లో ఉండగానే పాకిస్థాన్‌కు చెందిన అసద్ ఖటక్ అనే పారిశ్రామికవేత్తను వివాహం చేసుకుంది. వీరి వివాహం 2013లో జరిగింది. ఈ మధ్యకాలంలో అమ్మడుకి సినిమాల్లో నటించాలనే కోరిక పుట్టింది. ఈ విషయాన్ని భర్తతో పాటు అత్తమామలకు చెప్పగా, వారు నిర్మొహమాటంగా నో చెప్పారు. 
 
దీంతో సినిమాల కోసం తన భర్తకు దూరం కావాలనే నిర్ణయానికి వచ్చింది. ఆ వెంటనే తన న్యాయవాది ద్వారా విడాకుల కోసం లాహోర్ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో అసద్‌కు కోర్టు సమన్లు పంపింది. ఆ సమన్లకు అసద్ స్పందించకపోవడంతో, వీణామాలిక్‌కు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. చట్టపరంగా విడాకులు మంజూరు చేసింది. దీంతో, సినిమాల్లో రీఎంట్రీకి ప్లాన్ చేసుకుంటోంది ఈ హాట్ బ్యూటీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుక్కపై సన్నీలియోన్ ట్విట్టర్ పోస్ట్... హోలీ ఆనందం...