P.G. Vinda, Rahul Srivastava, G. Bheemudu
2025 తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ (TCA) ఎన్నికలు ముగిశాయి. అసోసియేషన్‌లోని సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో సభ్యుల అసాధారణ హాజరు అసోసియేషన్‌లో ఐక్యత, ఉత్సాహాన్ని ప్రతిబింబించింది.
సినిమాటోగ్రఫీ గురించి అందరికీ అవగాహన కల్పించటానికి, ఈ రంగంలోని నిపుణుల సాధికారతకు సమర్ధవంతమైన నాయకత్వం, దూరదృష్టితో అవిశ్రాంతంగా పని చేసిన పి.జి.విందా గారిని సభ్యులు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. TCA ఎన్నికల్లో పి.జి.విందా అధ్యక్షుడిగా ఎన్నికకాగా..రాహుల్ శ్రీవాత్సవ్ జనరల్ సెక్రటరీగా, జి.భీముడు(అలియాస్ జి.శ్రీకాంత్) ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు.
గతసారి పి.జి.విందా అసోసియేషన్ అభివృద్ధి కోసం తీసుకున్న చొరవను, వారి తపనను గుర్తించిన సభ్యులు మరోసారి ఆయన్ని తిరిగి ప్రెసిడెంట్‌గా ఎంపిక చేసుకున్నారు. ఇది వరకు ఆయన నాయకత్వంలో నిర్మాణపరంగా తమ సినిమాటోగ్రఫర్స్‌కు సంబంధించిన పనులను సరళీకృతం చేశారు. చేయాల్సిన పనులను ఓ పద్ధతి ప్రకారం, సరైన మార్గదర్శకత్వంలో పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇవి ఆశాజనక సినిమాటోగ్రాఫర్‌లకు అధిక పోటీవుండే ఫిల్మ్ ఇండస్ట్రీలోని పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, ఎలా ముందుకు వెళ్లి వృద్ధి చెందాలనే విషయాలను తెలియజేసేలా పి.జి. విందా ప్యానెల్ చేసిన కార్యక్రమాలు సభ్యుల అవగాహనకు వీలు కల్పించాయి.
పి.జి.విందా ఆలోచనతో అసోసియేషన్‌లో ఓ సహకార ఇకోసిస్టమ్ అనేది ఏర్పడింది. దీని కారణంగా యువ ప్రతిభావంతులు అవకాశాలను అన్వేషించుకోవటానికి, తమ వర్క్‌లో సాంకేతికంగా ముందడుగు వేయటానికి వీలుకలిగింది. ఈ కారణంగా వారిలో ఐక్యత రావటంతో పాటు వారికి మంచి గుర్తింపు కూడా దక్కుతుందనటంలో సందేహం లేదు.
ఈ సందర్భంగా పి.జి.విందా మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను అధ్యకుడిగా మరోసారి ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. సభ్యులందరూ ఉత్సాహంగా ఇక్కడకు వచ్చి ఎన్నికల్లో పాల్గొని మా ప్యానెల్ విజయానికి దోహదం చేశారు. ఇది కేవలం కొందరి గెలుపు కాదు.. అసోసియేషన్‌లోని సభ్యులందరి విజయం. ఇదే ఉత్సాహంతో తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్‌ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లటానికి అందరం సమిష్టిగా ముందడుగు వేద్దాం అన్నారు.