Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కబాలి రిలీజ్.. రోబో-2ను పక్కనబెట్టేసి.. బాహుబలి-2 కోసం మాహీష్మతి కొత్త సామ్రాజ్యం!!

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన కబాలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజై ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కబాలి రిలీజ్ మేనియా ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో త

Advertiesment
Over 500 People Are Working To Create The Kingdom In Baahubali 2 And It's Sure To Be Epic!
, శుక్రవారం, 5 ఆగస్టు 2016 (13:20 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన కబాలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజై ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కబాలి రిలీజ్ మేనియా ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం బాహుబలి 2 సినిమా కోసం.. రజనీ కాంత్ రోబో2ను పక్కనబెట్టేశారని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. 
 
రోబో సీక్వెల్‌ను పక్కనబెట్టి.. ప్రస్తుతం బాహుబలి 2 కోసం సాబు శిరీల్ పనిచేస్తున్నాడని తెలిసింది. ఇందుకోసం సాబు శిరీల్ హైదరాబాదులోనే మకాం వేశాడని తెలిసింది. బాహుబలి సినిమా కోసం భారీ సెట్స్ ఏర్పాటు చేస్తున్న శిరీల్.. అతని కింద రోజు దాదాపు 5వందల మంది ఈ సెట్ల నిర్మాణం కోసం పని చేస్తూనే ఉన్నారు. సినీ ప్రపంచంలో కనివినీ ఎరుగని చరిత్ర సృష్టించిన బాహుబలిని మరింత ఉన్నత సాంకేతిక విలువలతో ముగించేందుకు బాహుబలి 2 దర్శకుడు రాజమౌళి రేయింబవళ్లు కృషి చేస్తున్నాడు. 
 
బాహుబలి 2 కాపీ కాదని ఒరిజినల్ అనేందుకు వీలుగా సాబు శిరీల్ అనే ఆర్ట్‌ డైరెక్టర్‌‌ను రాజమౌళి నియమించాడు. బాహుబలి 1లో కొన్ని సెట్లు కొన్ని వేశాలు మేకప్‌‌లు ఇంగ్లీష్‌ సినిమాలో నుంచి మక్కీకి మక్కి కాపీ కొట్టారని సోషల్‌ మీడియాలో రాజమౌళిపై సెటైర్లు, కామెంట్లు వచ్చిన నేపథ్యంలో.. ఆ అపవాదు బాహుబలి 2లో రాకూడదని దర్శకుడు ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబు కొత్తదనంతో పనిచేస్తున్నారు. ఇందుకోసం ఒక కొత్త సామ్రాజ్యాన్నే సృష్టిస్తున్నారు.
 
ఇందు కోసం రోజు దాదాపు ఐదు వందలమంది ఈ సెట్ల నిర్మాణం కోసం పని చేస్తూనే ఉన్నారు. రంగులు వేసేవారు, కార్పెంటర్లు, మౌల్డింగ్‌, వెల్డింగ్‌, ఆర్ట్‌ పని చేసేవారు ఇలా రాత్రి పగలు పనికి విరామం లేదు. సాబు జీవితంలో ఇది అతి పెద్ద సినిమా అని చెప్పవచ్చు. పది సినిమాలకు చేసేంత పని ఈ ఒక్క సినిమాకే ఒకేసారి దాదాపు 500 మంది శ్రమించి సెట్లు నిర్మిస్తున్నారు. 
 
యుద్ధ సన్నివేశాలు, అటవీ ప్రాంతాలు, సైనికులు, జంతువులు, గుర్రాలు, ఏనుగులు, కత్తులు, కటార్లు, సమస్తం బాహుబలి కోసం తయారైనాయి. ఇంకా  గ్రాఫిక్స్‌ వినియోగం చెప్పనవసరం లేదు. హాలీవుడ్‌ను తలదన్నే విధంగా గ్రాఫిక్స్‌ రూపొందిస్తున్నారు. నాజర్ చేయిని డమ్మీ చర్మంతో రూపొందించారు. ప్రభాస్‌, రానా వాడే ఆయుధాలు మనం చూసేందుకు ఎంతో పెద్దగా బరువుగా కనిపిస్తాయి. 
 
అయితే నిజంగా అవి మోస్తే అసలు బరువే ఉండదు. సునాయాసంగా వాటిని తిప్పుతూ వాడవచ్చు. రబ్బర్‌ ఫోన్‌‌తో ఆయుధాలు తయారు చేస్తున్నారు. ఇలా ప్రతీ సీన్‌కి కొంత కొత్తదనాన్ని ప్రత్యేకతను జోడిస్తూ రాజమౌళి బాహుబలి 2ని తనదైన శైలిలో రూపొందిస్తున్నాడు. మొత్తానికి బాహీష్మతికి కొత్త సామాజ్రమే సిద్ధమవుతుందన్నమాట. అందుకే రజనీ రోబోను కూడా కాదని శిరీల్ బాహుబలి 2 కోసం పనిచేస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో.. రాజమౌళి బాహుబలి కోసం రూ. 100 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడా?