Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డిజిటిల్ రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకురానున్న ఓటీటీ గ్లోపిక్స్

OTT Glopix team

డీవీ

, శుక్రవారం, 3 జనవరి 2025 (17:20 IST)
OTT Glopix team
వినోద రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకు వచ్చేందుకు కొత్త ఓటీటీ రాబోతోంది. బెంగళూరు బేస్డ్‌గా ఈ కొత్త ఓటీటీ సంస్థ "గ్లోపిక్స్' కార్యకలాపాలు సాగించనుంది. ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే గ్లోపిక్స్ సంస్థ ఓ అడుగు ముందుకు వేసింది.  గ్లోపిక్స్‌ లోగోను అధికారికంగా ప్రారంభించారు. ఈ ఏడాది వేసవిలో పూర్తి స్థాయిలో ఈ ఓటీటీ సంస్థ అందుబాటులోకి రానుంది. 
 
గ్లోపిక్స్‌ను విన్సే ఎల్ ఏ, అనిత సంయుక్తంగా స్థాపించగా.. లోకేష్ సన్నయ్య ఫౌండర్ మెంబర్‌/సిఎమ్ఓ ఫౌండింగ్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. మారుతి రాజీవ్ ఫౌండర్ మెంబర్‌/సిటిఓ, రూపేశ్ మామిళ్లపల్లి హైదరాబాద్ కంటెంట్ హెడ్‌గా వ్యవహరించనున్నారు. నేడు ఈ లోగోను సౌత్‌లో మూడు చోట్ల ఘనంగా లాంచ్ చేసారు. బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో ఈ లోగోను లాంచ్ చేసారు. ఇక ఈ ఫ్లాట్ ఫాంలో ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, రియాల్టీ షోలు అంటూ 360 డిగ్రీల ఎంటర్టైన్మెంట్‌ను అందించబోతున్నారు. 
 
 ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్లోపిక్స్ ఫౌండర్ మెంబర్‌ మారుతి రాజీవ్ మాట్లాడుతూ.. ‘నేడు మా గ్లోపిక్స్ లోగోను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మన కల్చర్, మన సంస్కృతి, మన మూలాల్లోంచి కథలను గ్లోబల్‌గా అందించేందుకు మా గ్లోపిక్స్‌ను ప్రారంభిస్తున్నాం. మంచి కంటెంట్‌, కాన్సెప్ట్‌లను అందించేందుకు ఈ కొత్త ఫ్లాట్ ఫాంను తీసుకొస్తున్నామ’ని అన్నారు.
 
 గ్లోపిక్స్ ఫౌండింగ్ మెంబర్ లోకేష్ మాట్లాడుతూ.. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 అందరికీ అంతా మంచి జరగాలి. మేం మా గ్లోపిక్స్ లోగోను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ప్రాంతీయతను చాటేలా, లోకల్ టాలెంట్, కల్చర్‌ను ఎంకరేజ్ చేసేందుకు గ్లోపిక్స్‌ను స్టార్ట్ చేస్తున్నాం. అన్ని రకాల కంటెంట్‌ను అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. మన కంటెంట్‌ను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లాలని అనుకుంటున్నామ’ని అన్నారు. 
 
 గ్లోపిక్స్ హైదరాబాద్ కంటెంట్ హెడ్ రూపేశ్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌, కాన్సెప్ట్‌లను అందించేందుకు ఈ కొత్త ఫ్లాట్ ఫాంను తీసుకొస్తున్నామని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sreeleela: 2025లో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఖాయమా? కరణ్ జోహార్ చేతిలో పడితే?