Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

ఊరికి ఉత్త‌రాన పాడుబ‌డిన ఇంటిలో దేవేరీ ఏం చేస్తుంది!

Advertiesment
Oooriki uttarana
, గురువారం, 5 ఆగస్టు 2021 (16:47 IST)
deepali
ఊరికి ఉత్త‌రాన ఓ పాడుప‌డిన బంగ్లా అందులో ఓ అంద‌మైన అమ్మాయి. అద్దం ముందు కూర్చుని వ‌య్యారంగా త‌డిసిన త‌న జుట్టును త‌న సొగ‌సులు చూసుకుంటుండ‌గా! ష‌డెన్‌గా ఏదో శ‌బ్దం. ఆ త‌ర్వాత ఏమయిందంటే? అంటూ క‌థ‌లు చెబుతుండేవారు. అదే సినిమా అయితే ఎలా వుంటుందో కానీ, ఊరికి ఉత్తరాన చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన నాయిక స్టిల్ అలానే వుంది. ఇంచుమించు అలాంటి స‌స్పెన్స్ క‌థ‌తో ఈ సినిమా రూపొంద‌బోతోంది. 
 
టాలీవుడ్ లో చిన్న సినిమాల హవా నడుస్తోంది. చాలా చిన్న సినిమాలు వస్తున్నప్పటికీ కొన్ని సినిమాలు డిఫరెంట్ కథాంశంతో థ్రిల్ చేస్తూ ప్రేక్షక లోకానికి కొత్తదనాన్ని పరిచయం చేస్తున్నాయి. అటువంటి సినిమానే “ఊరికి ఉత్తరాన”. ప్రేమకు మరణం లేదు.. కానీ ప్రేమిస్తే మరణమే..! అనే భిన్న‌మైన అంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.
 
గాలి వచ్చిన సంగతి చెట్టు ఆకు చెప్తాది..వన వచ్చిన సంగతి మట్టి వాసన చెప్తది.. కానీ ప్రేమ విలువ కన్నవాళ్ళు చచ్చాక తెలుస్తది.. అంటూ సాగే ఈ టీజర్.. వారం రోజులు గడువు ఇస్తున్న లేదంటే ఊరికి ఉత్తరాన ఉన్న వుట్టికి వేలాడదీస్తా. అంటూ ఈ టీజర్ ముగిస్తుంది.
 
కాగా, నరేన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. నాయిక‌గా దీపాలి నటిస్తోంది. ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్ వనపర్తి వెంకటయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికిసతీష్ పరమవేద దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 10న దేవేరీ అనే సాంగ్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆతీంద్రీయ శ‌క్తులు పుట్టించే ఫోన్ క‌థ‌తో చతుర్ముఖం