Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంకితభావం, సామాజిక బాధ్యత తెలిసిన ఓంపురి

నటుడికి వుండాలన్న పరిపూర్ణ లక్షణాలు ఓంపురికి వున్నాయని 'అంకురం' చిత్ర దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు తెలియజేస్తున్నారు. ఓంపురితో తనకుగల అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకుంటూ.. 1990చివర్లో అంకురం సినిమా షూటింగ్‌ను రాజమండ్రిలో ప్రారంభించాం. అక్కడికి ఆయన వచ్చారు

Advertiesment
అంకితభావం, సామాజిక బాధ్యత తెలిసిన ఓంపురి
, శుక్రవారం, 6 జనవరి 2017 (22:16 IST)
నటుడికి వుండాలన్న పరిపూర్ణ లక్షణాలు ఓంపురికి వున్నాయని 'అంకురం' చిత్ర దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు తెలియజేస్తున్నారు. ఓంపురితో తనకుగల అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకుంటూ.. 1990చివర్లో అంకురం సినిమా షూటింగ్‌ను రాజమండ్రిలో ప్రారంభించాం. అక్కడికి ఆయన వచ్చారు. అప్పటికే బాలీవుడ్‌లో పెద్ద నటుడిగా పేరుపొందడంతో మీడియా అంతా వచ్చి ఆయన్ను ఈ చిత్రంలో నటించడానికి కారణేమిటని ప్రశ్నించింది. ఏ భాషల్లోనైనా సున్నితమైన అంశాలతో కూడిన సామాజిక అవగాహన వున్న సినిమాలు అరుదుగా వస్తుంటాయి. కళాకారుడిగా అలాంటి సినిమాకు ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే ఇందులో నటించానని బదులిచ్చారు.
 
ఓంపురితో పరిచయానికి ముందు దర్శకుడు గోవింద్‌ నిహాలానీతో వున్న పరిచయమే దగ్గర చేసిందని ఉమామహేశ్వరరావు తెలిపారు. అయితే అంకురం అనే సినిమా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేదికాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా వెళితే ఎటువంటి ఉపద్రవాలు వస్తాయనేవి ఇందులో చూపించాం. ఈ చిత్రానికి కొన్ని అవాంతరాలు కూడా ఏర్పడ్డాయి. దాదాపు రెండేళ్ళ సినిమాను తీశాం. అయినా పారితోషికాన్ని పెంచకుండా.. అనుకూలంగా డేట్స్‌ ఇచ్చి ప్రోత్సహించారు. ఇదే రీతిలో నటి రేవతికూడా సహకరించారు. అసలు ఓంపురి పాత్రకు పెద్దగా డైలాగ్‌లు వుండవు. 
 
చివర్లో కొన్ని డైలాగ్‌లు పలకాలి. అయినా.. సహనంతో వాటిని తనే తెలుగులో మాట్లాడారు. వాటిని సినిమాలో వేరే వారితో డబ్బింగ్‌ చెప్పించాం. 'అర్థసత్య'లో ఓంపురిని పరిపూర్ణనటుడిగా నేను చూశాను. అంతకుముందు పలు చిత్రాల్లో చేసి అంతర్జాతీయ చలన చిత్రోత్సావాల్లో పేరు సంపాదించినా.. అర్థసత్యను మించి సినిమా లేదని నాకనిపించింది. ఆ చిత్రం చూశాకనే ఆయన్ను అంకురంలో నటించాలని అడిగాను. అందుకు ఆయన సమ్మతించారు.
 
ఓంపురి వున్నతస్థాయికి ఎదగడానికి కారణం. ఆయన తీసుకున్న శిక్షణే కారణం. పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లోనూ, నేషల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలోనూ ఆయన శిక్షణ పొందారు. అదే ఆయన్ను గొప్పస్థాయికి తీసుకెళ్ళింది. ఆయనలో తెలీని కమ్యూనిస్టు కన్పించేవాడు. సామాజిక భావాంకితగల వ్యక్తి. సోషలిస్టు భావం వున్న మనిషి. ఆయనతో పలు అంశాలను చర్చించినప్పుడు ఆయనలో ఓ మేథావి కన్పించాడు. నటుడిగా అన్ని విషయాలు తెలియాలన్న సూత్రానికి ఆయన నిదర్శనం అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్న మా ఆవిడ తలస్నానం చేయించింది