Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18న మాస్‌ హీరో విశాల్‌ 'ఒక్కడొచ్చాడు'.. టీజర్‌కి 25 లక్షల వ్యూస్‌

మాస్‌ హీరో విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్న

Advertiesment
Okkadochadu teaser
, ఆదివారం, 23 అక్టోబరు 2016 (15:49 IST)
మాస్‌ హీరో విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 18న గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ.. ''ఈ చిత్రానికి సంబంధించిన టోటల్‌ షూటింగ్‌ పూర్తయింది. 'ఒక్కడొచ్చాడు' టీజర్‌ను శుక్రవారం సాయంత్రం హీరోయిన్‌ కాజల్‌ విడుదల చేశారు. ఒక్కరోజులోనే తెలుగు, తమిళ భాషల్లో ఈ టీజర్‌కు 25 లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. టీజర్‌కి అన్నిచోట్ల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. విశాల్‌ కెరీర్‌లోనే 'ఒక్కడొచ్చాడు' డిఫరెంట్‌ మూవీ అవుతుంది. 
 
యాక్షన్‌ వుంటూనే మంచి మెసేజ్‌తో రూపొందుతున్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులోని పాటలు, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, ఛేజ్‌లను చాలా రిచ్‌గా తియ్యడం జరిగింది. సినిమాకి అవి చాలా పెద్ద హైలైట్‌ అవుతాయి. హిప్‌హాప్‌ తమిళ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నవంబర్‌ మొదటి వారంలో ఆడియోను రిలీజ్‌ చేసి, నవంబర్‌ 18న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. 'ఒక్కడొచ్చాడు' విశాల్‌కి తెలుగులో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు. 
 
విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, పాటలు: డా. చల్లా భాగ్యలక్ష్మీ, ఎడిటింగ్‌: ఆర్‌.కె.సెల్వ, డాన్స్‌: దినేష్‌, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#HappyBirthdayPrabhas ... "భళి భళి భళిరా భళి... సాహోరే బాహుబలి"... (Video)