Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ 'బిగ్ బాస్' ప్రస్తుతం ముద్దు వరకూ వచ్చింది... మరి మిగిలిన రోజుల్లో...?

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో పట్ల ప్రేక్షకుల చూపును ఓ ముద్దుతో అలెర్ట్ చేసేశారు. ఇంతకీ వివరం ఏందయా అంటే... ఈ షోలో పైసా వసూల్ - లగ్జరీ బడ్జెట్ అనే టాస్క్ ఇచ్చాడు. అందులో పార్టిసిపెంటును రెండుగా విడగొట్టి యజమానుల టీంగా మిగిలిన వారిని ఏర్పరిచారు. యజమాను

Advertiesment
NTR Big boss updates
, గురువారం, 3 ఆగస్టు 2017 (22:01 IST)
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో పట్ల ప్రేక్షకుల చూపును ఓ ముద్దుతో అలెర్ట్ చేసేశారు. ఇంతకీ వివరం ఏందయా అంటే... ఈ షోలో పైసా వసూల్ - లగ్జరీ బడ్జెట్ అనే టాస్క్ ఇచ్చాడు. అందులో పార్టిసిపెంటును రెండుగా విడగొట్టి యజమానుల టీంగా మిగిలిన వారిని ఏర్పరిచారు. యజమానుల బృందం తిండి నుంచి డైనింగ్ టేబుల్ వరకూ, చివరకు టాయిలెట్ల వరకూ తాము ఎంత అనుకుంటే అంత వినియోగదారుల టీం నుంచి వసూలు చేస్తారు.

అదే సమయంలో వినియోగగారుల టీం జాగ్రత్తగా ఖర్చుపెట్టి, తమవద్ద ఎక్కువ డబ్బును దాచుకున్నారా? లేక యజమానులే వినియోగదారుల నుంచి ఎక్కువ రాబట్టారా? ఫైనల్‌గా ఎవరి వద్ద ఎక్కువ డబ్బులు ఉంటాయో వారే విజేతలు అనేది టాస్క్.
 
బాత్రూంలోని నాప్‌కిన్లకు కూడా భారీగా మొత్తం వసూలు చేస్తున్నారని వినియోగదారుల టీంలోని అర్చన, ఆదర్శ్‌లు యజమానుల టీంలోని హరితేజను తిట్టారు. దానికి హరితేజ బాధపడింది. మరీ నాప్‌కిన్లకు కూడా డబ్బులు అడుగుతానా.. నేనంత చీప్‌గా కనిపిస్తున్నానా? వినియోగదారులు తనను ఆడపిల్లగానే కాదు... మనిషిగా కూడా చూడటం లేదని వాపోయింది. అర్చన సర్దిచెప్పడంతో వివాదం తొలగింది. 
 
చివరకు వినియోగదారుల టీం వద్దే ఎక్కువ డబ్బు ఉండటం, డబ్బులను ఆదా చేయడం కోసం ఎన్నో కష్టాలు పడి ఎక్కువ మొత్తం జాగ్రత్త చేశారు. ఇక ఇందులోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన దీక్షాపంత్‌తో ప్రిన్స్ గొడవపడ్డాడు. చివరకు సారీ చెప్పాలని భావించి, ఎలా సారీ చెప్పాలి అని ప్రిన్స్ అడగ్గా, ఓ ముద్దు ఇచ్చి సారీ చెప్పమని కత్తి మహేష్ సూచించడంతో ప్రిన్స్, దీక్షాపంత్‌కి ముద్దుపెట్టి సారీ చెప్పేశాడు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా చేస్తున్న తెలుగు బిగ్ బాస్ ముద్దు వరకూ వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"బాహుబలి" పెళ్లిచూపులు ఆస్ట్రేలియాలో జరుగుతాయా?