కట్టప్ప ఛాన్స్‌ను మిస్ చేసుకుంది ఎవరో తెలుసా?
'బాహుబలి-2' సినిమాలో కట్టప్ప పాత్ర ఎంతో కీలకమో సినిమా చూసిన వారందరికీ తెలుసు. ఈ పాత్రకు తమిళ నటుడు సత్యరాజ్ పూర్తి న్యాయం చేశాడు. ఈ పాత్రకు సత్యరాజ్ మినహా ప్రేక్షకులు ఎవ్వరిని ఊహించుకోలేక పోయారు. బాహు
'బాహుబలి-2' సినిమాలో కట్టప్ప పాత్ర ఎంతో కీలకమో సినిమా చూసిన వారందరికీ తెలుసు. ఈ పాత్రకు తమిళ నటుడు సత్యరాజ్ పూర్తి న్యాయం చేశాడు. ఈ పాత్రకు సత్యరాజ్ మినహా ప్రేక్షకులు ఎవ్వరిని ఊహించుకోలేకపోయారు. అలాంటి ఈ పాత్రకు ముందుగా సత్యరాజ్‌ను అనుకోలేదట. కట్టప్పగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను ముందుగా సంప్రదించారట.
కానీ వరుస సినిమాలతో బిజీగా వున్న మోహన్ లాల్.. ఈ సినిమా బల్క్‌గా డేట్స్ ఇచ్చే ఉద్దేశం లేక నో చెప్పాడని సమాచారం. మోహన్ లాల్ ఈ సినిమా ఛాన్స్ మిస్ చేసుకోవడంతో కట్టప్ప ఛాన్సును సత్యరాజ్ కైవసం చేసుకున్నాడని తెలిసింది.